అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | మోసం, లంచం ఆరోపణలకు సంబంధించి అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ (Gautam Adani), గ్రూప్ ఎగ్జిక్యూటివ్ సాగర్ అదానీలకు వ్యక్తిగతంగా సమన్లను ఇమెయిల్ చేయడానికి అనుమతి ఇవ్వాలని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ యూఎస్ కోర్టును కోరింది.
ప్రిఫరెన్షియల్ పథకం కింద భారత్, ఇండోనేషియా, కెన్యా దేశాల్లోని కొన్ని రంగాల ఉత్పత్తులకు కల్పించిన ఎగుమతి ప్రయోజనాలను యూరోపియన్ యూనియన్ (European Union) రద్దు చేయడంతో మన దేశంనుంచి ఈయూకు ఎగుమతి చేసే పలు ఉత్పత్తులపై టారిఫ్‌లు 9.6 శాతంనుంచి 12 శాతానికి పెరగనున్నాయి. దీని ప్రభావం మార్కెట్‌పై కనిపిస్తోంది. ఈ రెండు కారణాలతో దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) కుదుపులకు లోనయ్యింది. శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 28 పాయింట్లు, నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. అయితే ఈయూ చర్యతోపాటు అదానీకి యూఎస్ సమన్లకు సంబంధించిన అంశాలతో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఇంట్రాడే గరిష్టాలనుంచి సెన్సెక్స్ 1,045 పాయింట్లు, నిఫ్టీ (Nifty) 322 పాయింట్లు పడిపోయాయి. చివరికి సెన్సెక్స్ 770 పాయింట్ల నష్టంతో 81,537 వద్ద, నిఫ్టీ 241 పాయింట్ల నష్టంతో 25,048 వద్ద స్థిరపడ్డాయి.
అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి..
బీఎసఈలో సర్వీసెస్ ఇండెక్స్ 4.20 శాతం, యుటిలిటీ 3.52 శాతం, రియాలిటీ ఇండెక్స్ 3.35 శాతం, పవర్ 2.81 శాతం, ఇన్‌ఫ్రా 2.65 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 2.37 శాతం, క్యాపిటల్ గూడ్స్ 2.09 శాతం, పీఎస్‌యూ 1.73 శాతం, క్యాపిటల్ మార్కెట్ 1.70 శాతం, ఇండస్ట్రియల్ 1.69 శాతం నష్టపోయాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.19 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.56 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 1.16 శాతం నష్టంతో ముగిశాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎసఈలో నమోదైన కంపెనీలలో 1,321 కంపెనీలు లాభపడగా 2,887 స్టాక్స్ నష్టపోయాయి. 153 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 75 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 409 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 13 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 10 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎసఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 6.84 లక్షల కోట్లు ఆవిరయ్యింది.
Top Gainers : బీఎసఈ సెన్సెక్స్‌లో 7 కంపెనీలు లాభపడగా.. 23 కంపెనీలు నష్టపోయాయి. టెక్ మహీంద్రా 0.79 శాతం, హెచ్‌యూఎల్ 0.67 శాతం, ఇన్ఫోసిస్ 0.35 శాతం, ఆసియన్ పెయింట్ 0.33 శాతం, టీసీఎస్ 0.30 శాతం పెరిగాయి.
Top Losers : అదానిపోర్ట్ట్స్ 7.52 శాతం, ఎటర్నల్ 6.29 శాతం, ఇండిగో 4.27 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.72 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 2.26 శాతం నష్టపోయాయి.