Homeఅంతర్జాతీయంHaryana | హర్యానాలో మరో పోలీస్‌ అధికారి ఆత్మహత్య

Haryana | హర్యానాలో మరో పోలీస్‌ అధికారి ఆత్మహత్య

Haryana | హర్యానాలో మరో పోలీస్‌ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల ఐపీఎస్​ అధికారి పూరన్​కుమార్​ తుపాకీతో కాల్చుకొని చనిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఏఎస్సై సందీప్​ సైతం అదేవిధంగా బలవన్మరణానికి పాల్పడ్డారు.

- Advertisement -

అక్షరటుడే, నేషనల్​ డెస్క్ : Haryana | హర్యానాలో (Haryana) మరో పోలీస్‌ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. సైబర్ సెల్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై సందీప్​ కుమార్​ గన్​తో కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నాడు.

హర్యానాలో ఇటీవల ఐపీఎస్​ అధికారి పూరన్​కుమార్​ తుపాకీతో కాల్చుకొని చనిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఏఎస్సై సందీప్ (ASI Sandeep)​ సైతం అదేవిధంగా బలవన్మరణానికి పాల్పడ్డారు. కాగా.. ఐపీఎస్‌ పూరన్‌పై సందీప్​ అవినీతి ఆరోపణలు చేశారు. ఆత్మహత్యకు ముందు సందీప్​ మూడు పేజీల సూసైడ్​ నోట్​ రాశారు. అలాగే సెల్ఫీ వీడియో కూడా తీశారు. అనంతరం రోహ్‌తక్‌లోని (Rohtak) తన పొలంలోని ఒక గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. సూసైడ్, పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు.

Haryana | ప్రాణాన్ని త్యాగం చేస్తున్నా..

సూసైడ్​ నోట్​లో “నా ప్రాణాలను త్యాగం చేసి దర్యాప్తు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ అవినీతి కుటుంబాన్ని వదిలిపెట్టకూడదు” అని సందీప్ కుమార్ రాసినట్లు తెలుస్తోంది. వ్యతిరేకతను అణచివేయడానికి కుల చైతన్యాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ఐపీఎస్ అధికారి (IPS Officer) వ్యవస్థను మార్చారని ASI ఆరోపించారు. అవినీతికి సంబంధించిన బలమైన ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. సందీప్​ ఆత్మహత్యకు ముందు ఐపీఎస్​ అధికారి పురాన్​ కుమార్‌పై అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలు చేశారు. అంతేగాకుండా ఐపీఎస్​ అధికారి పూరన్​ అరెస్టు భయంతోనే ఆత్మహత్య చేసుకున్నారని సందీప్​ పేర్కొన్నారు. ఆయన “కులతత్వాన్ని ఉపయోగించుకోవడం ద్వారా వ్యవస్థను హైజాక్ చేశాడు” అని ఆరోపించారు.