ePaper
More
    Homeటెక్నాలజీRealme New Phone | అద్భుతమైన ఫీచర్స్‌తో రియల్‌మీ నుంచి మరో ఫోన్‌

    Realme New Phone | అద్భుతమైన ఫీచర్స్‌తో రియల్‌మీ నుంచి మరో ఫోన్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Realme New Phone | ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ అయిన రియల్‌మీ(Realme) శక్తిమంతమైన బ్యాటరీతో మరో మోడల్‌ ఫోన్‌ను తీసుకువస్తోంది. రియల్‌మీ 15 ప్రో(Realme 15 Pro) పేరుతో ఈనెల 24న భారత్‌లో లాంచ్‌ చేయనుంది. అద్భుతమైన డిజైన్‌తో తీసుకువస్తున్న ఈ మోడల్‌ ఫ్లిప్‌కార్ట్‌(Flipkart)తోపాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనుంది. ఈ మోడల్‌కు సంబంధించి లీకైన వివరాలు తెలుసుకుందామా..

    Realme New Phone | డిస్‌ప్లే..

    6.7 అంగుళాల 4D కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే 144 Hz రిఫ్రెష్‌ రేట్‌తో వస్తోంది. 6500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌ను అందిస్తోంది. వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌ కోసం IP 69 రేటింగ్‌ కలిగి ఉంది. 7.69mm ఫ్రేమ్‌, 187 గ్రాముల బరువు ఉంది.

    Realme New Phone | ప్రాసెసర్‌..

    క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 gen 4 ప్రాసెసర్‌ అమర్చే అవకాశాలున్నాయి. ఇది గేమింగ్‌, మల్టీ టాస్కింగ్‌కు ఉపయోగపడుతుంది.

    Realme New Phone | సాఫ్ట్‌వేర్‌..

    ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత రియల్‌మీ UI 6.0 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కలిగి ఉంటుంది.

    Realme New Phone | కెమెరా..

    ట్రిపుల్‌ కెమెరా సెట్‌అప్‌ను కలిగి ఉంటుంది. 50 MP మెయిన్‌ సెన్సార్‌, అల్ట్రావైడ్‌ లెన్స్‌తో విడుదల కాబోతోంది. ముందువైపు 50 ఎంపీ సెన్సార్‌ ఉంది.

    Realme New Phone | ఏఐ ఫీచర్లు..

    ఏఐ ఎడిట్‌ జిని, ఏఐ పార్టీ మోడ్‌ వంటి ఫీచర్లున్నాయి.

    Realme New Phone | బ్యాటరీ సామర్థ్యం..

    7000 ఎంఏహెచ్‌ భారీ బ్యాటరీని అమర్చారు. 80 w ఫాస్ట్‌ చార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది.

    Realme New Phone | వేరియంట్స్‌..

    ఫ్లోయింగ్‌ సిల్వర్‌, సిల్క్‌ పర్పుల్‌, వెల్వెట్‌ గ్రీన్‌ కలర్స్‌లో లభించనుంది. 8 GB + 128GB, 12GB +512GB వేరియంట్‌లలో తీసుకువస్తున్నారు. దీని ధర రూ. 28 వేల వరకు ఉంటుందని భావిస్తున్నారు.

    More like this

    GST | దిగిరానున్న ధరలు.. నిలిచిన కొనుగోళ్లు.. జీఎస్టీ శ్లాబ్‌ మార్పుతో తగ్గనున్న ధరలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST | కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ(GST)లో తీసుకువచ్చిన సంస్కరణల(Reforms)తో వివిధ వస్తువుల ధరలు తగ్గనున్నాయి....

    Mla Prashanth Reddy | చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి: Mla Prashanth Reddy | విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్...

    KTR | కవిత సస్పెన్షన్​పై స్పందించిన కేటీఆర్​.. ఏమన్నారంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ (KTR) సోమవారం తెలంగాణ...