అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Realme 15x 5G | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ తయారీ కంపెనీ రియల్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్(Smart Phone)ను భారత మార్కెట్‌లో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది.
రియల్‌మీ 15ఎక్స్(Realme 15X) 5జీ పేరుతో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాంలలో అందుబాటులో ఉన్న ఈ మోడల్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.
డిస్‌ప్లే : 6.81 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేతో వస్తున్న ఈ ఫోన్ 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 1080 x 2460 పిక్సెల్స్ రిజల్యూషన్, మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కలిగి ఉంది.
ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 6300 Soc ప్రాసెసర్ ఉపయోగించారు.
ఆపరేటింగ్ సిస్టమ్ : రియల్‌మీ UI 6.0 ఆధారిత ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.
కెమెరా సెటప్ : వెనకవైపు 50 MP మెయిన్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్(Triple camera setup) కలిగి ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అమర్చారు.
బ్యాటరీ సామర్థ్యం : 7000 mAh బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్.. 60w ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
వేరియంట్స్ : రెడ్, బ్లూ కలర్స్‌లో తీసుకువస్తున్నారు. మూడు వేరియంట్లలో ఈ ఫోన్ లభించే అవకాశాలు ఉన్నాయి. వాటి ధరలు ఇలా ఉంటాయని తెలుస్తోంది. .
6 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999.
8 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,999.
8 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,999.
కార్డ్ ఆఫర్ : ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేసేవారికి 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.