Homeతాజావార్తలుBEL Notificatoin | బీఈఎల్‌ నుంచి మరో నోటిఫికేషన్‌.. ప్రొబెషనరీ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

BEL Notificatoin | బీఈఎల్‌ నుంచి మరో నోటిఫికేషన్‌.. ప్రొబెషనరీ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రొబెషనరీ ఇంజినీర్ పోస్టుల భర్తీ కోసం భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్‌ 14వ తేదీ వరకు గడువుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: BEL Notificatoin | భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (Bharat Electronics Limited) నుంచి మరో నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. వివిధ విభాగాలలో ప్రొబెషనరీ ఇంజినీర్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్‌ను (Notification) విడుదల చేసింది. పోస్టులు, అర్హతల వివరాలిలా ఉన్నాయి.

భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 340.

పోస్టు పేరు : ప్రొబెషనరీ ఇంజినీర్.

విభాగాలు – ఎలక్ట్రానిక్స్‌ 175, మెకానికల్‌ 109, కంప్యూటర్‌ సైన్స్‌ 42, ఎలక్ట్రికల్‌ 14.

విద్యార్హతలు : బీఈ(B.E.), బీటెక్‌, బీఎస్సీ పూర్తి చేసినవారు అర్హులు.

వయోపరిమితి : అక్టోబర్‌ ఒకటో తేదీ నాటికి గరిష్ట వయసు 25 ఏళ్లు. ఓబీసీలకు (OBC) మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా..

దరఖాస్తు రుసుము : ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతర వర్గాలకు రూ. 1,180 (జీఎస్టీతో కలిపి).

దరఖాస్తు గడువు : నవంబర్‌ 14.

ఎంపిక విధానం : మొదట కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ (Interview) ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. తెలంగాణలో (Telangana) హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌లలో పరీక్ష కేంద్రాలుంటాయి. ఇంగ్లిష్‌, హిందీలలో పరీక్షకు హాజరు కావొచ్చు.

పూర్తి వివరాలకు బీఈఎల్‌ అధికారిక వెబ్‌సైట్‌ www.bel-india.in లో సంప్రదించండి.