అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Realme P4x 5G | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను విడుదల చేస్తూనే ఉంది. భారత స్మార్ట్‌ఫోన్ (Smartphone) మార్కెట్‌లోకి మరో మోడల్‌ను రిలీజ్ చేసింది. గురువారం(డిసెంబర్ 4న) ఈ మోడల్ లాంచ్ అయ్యింది. ఫోన్ స్లో కాకుండానే ఒకేసారి 90 యాప్‌లను వాడేలా హైస్పీడ్, గేమింగ్ ఫర్‌ఫార్మెన్స్‌తో తీసుకువస్తున్నట్లు కంపెనీ తెలిపింది. త్వరలో ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) సేల్ అందుబాటులోకి రానుంది. ఈ మోడల్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.
డిస్‌ప్లే : 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది. ఈ సెగ్మెంట్‌లో వీసీ కూలింగ్ సిస్టమ్ (Cooling System)ను కలిగి ఉన్న తొలి ఫోన్‌గా కంపెనీ చెబుతోంది.
సాఫ్ట్‌వేర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది 90 ఎఫ్‌పీఎస్ గేమ్‌ప్లేను సపోర్ట్ చేస్తుంది. 7,80,000 అంటుటు స్కోర్ కలిగి ఉంది. సెగ్మెంట్ ఫాస్టెస్ట్ స్మార్ట్‌ఫోన్‌గా కంపెనీ పేర్కొంటోంది.
కెమెరా : వెనకవైపు 50MP ప్రధాన కెమెరాతోపాటు 2ఎంపీ సెకండరీ కెమెరాలు ఉంటాయి. సెల్ఫీలుల, వీడియో కాలింగ్ కోసం ముందువైపు 8 ఎంపీ కెమెరా ఉంది.
బ్యాటరీ : 7000 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ అమర్చారు. 45w ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. బైపాస్ చార్జింగ్ సదుపాయం కూడా ఉంది. బ్యాటరీ ఆరేళ్ల వరకు మన్నుతుందని కంపెనీ చెబుతోంది.
వేరియంట్స్ : 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 15,999.
4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 17,499.
8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 19,499.
ఎలిజంట్ పింక్, లేక్ గ్రీన్, మట్టె సిల్వర్ రంగుల్లో లభించనుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌లతో 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
