ePaper
More
    Homeఅంతర్జాతీయంPakistan | పాక్​ మరో దుశ్చర్య.. భారత జవాన్​ను బంధించిన దాయాది దేశం

    Pakistan | పాక్​ మరో దుశ్చర్య.. భారత జవాన్​ను బంధించిన దాయాది దేశం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan | ఉగ్రవాదులను terrorists పెంచి పోషిస్తూ భారత్ Bharat​పై దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్​ pakistan మరో దుశ్చర్యకు దిగింది. పాక్​ ప్రమేయంతో జమ్మూకశ్మీర్​లోని పహల్ గామ్​లో ఉగ్రవాదులు pahalgam terror attack పర్యాటకులపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం దాయాది దేశంతో సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అయితే ఇప్పటికే సరిహద్దుల వెంబడి సైన్యాన్ని మోహరిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాక్​.. తాజాగా ఓ భారత జవాన్​ను bharat soldier అక్రమంగా బంధీగా తీసుకుంది. సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్‌ bsf జవాన్‌ను పాక్​ బంధించింది. తమ భూభాగంలోకి ప్రవేశించాడని ఆరోపిస్తూ ఈ చర్యకు దిగింది. అయితే పాక్​ సైనికులు అక్రమంగా బంధించారని భారత్​ పేర్కొంది.

    మరోవైపు పాక్​తో సింధు నది ఒప్పందాలతో వాణిజ్యం రద్దు చేస్తున్నట్లు బుధవారం భారత్​ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పాక్​ ప్రధాని pak pm షహబాజ్​ షరీఫ్ Shahbaz Sharif​ అధ్యక్షతన సమావేశమైన ఆ దేశ జాతీయ భద్రత కమిటీ పలు ప్రతీకార చర్యలు చేపట్టింది. భారత్​తో వాణిజ్యం రద్దు చేసుకుంటున్నట్లు పాక్​ ప్రకటించింది. తన గగనతలం మీదుగా భారత విమనాల రాకపోకలను అనుమతించమని స్పష్టం చేసింది. అంతేగాకుండా సిమ్లా ఒప్పందాన్ని Simla Agreement నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

    More like this

    Nepal | నేపాల్‌లో భ‌యాన‌క దృశ్యాలు.. తాడుకు వేలాడిన మంత్రులూ, ఫ్యామిలీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌లో ఇటీవల సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన నిషేధం, రాజకీయ అవినీతి,...

     AP Government | ఏపీలో 60ఏళ్ల పురుషులు, 58 ఏళ్ల మ‌హిళ‌ల‌కి శుభ‌వార్త‌.. ద‌ర‌ఖాస్తు ఫీజు కూడా లేద‌ట‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : AP Government | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Government) సీనియర్ సిటిజన్ల కోసం జారీ చేసే...

    Stock Market | స్తబ్దుగా దేశీయ స్టాక్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Domestic Stock Market) స్తబ్ధుగా సాగుతోంది. స్వల్ప...