ePaper
More
    Homeబిజినెస్​Ellenbarrie Industrial Gases IPO | నేటినుంచి మరో మెయిన్ బోర్డు ఐపీవో ప్రారంభం

    Ellenbarrie Industrial Gases IPO | నేటినుంచి మరో మెయిన్ బోర్డు ఐపీవో ప్రారంభం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Ellenbarrie Industrial Gases IPO | ఎలెన్‌బారీ ఇండస్ట్రియల్ గ్యాసెస్ లిమిటెడ్(Ellenbarrie Industrial Gases Ltd) ఐపీవోకు వస్తోంది. ఈ కంపెనీ ఆక్సిజన్(Oxigen), కార్బన్ డయాక్సైడ్, ఎసిటిలీన్, నైట్రోజన్, హీలియం, హైడ్రోజన్, ఆర్గాన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి ముఖ్యమైన వాయువులను తయారు చేసి పారిశ్రామిక, వైద్య రంగాలకు సరఫరా చేస్తుంటుంది. రూ. 852.53 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వస్తోంది. ఫ్రెష్ ఇష్యూ(Fresh issue) కింద రూ. 2 ఫేస్ వ్యాల్యూ(Face value) కలిగిన కోటి షేర్లను విక్రయించడం ద్వారా రూ. 400 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్(OFS) కింద రూ. 2 ఫేస్ వ్యాల్యూ కలిగిన 1.13 కోట్ల షేర్లను అమ్మడం ద్వారా రూ. 452.53 కోట్లు పొందాలని భావిస్తోంది. ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని కంపెనీ అప్పులు పూర్తిగా లేదా పాక్షికంగా చెల్లించడం కోసం, ప్రస్తుతం ఉన్న ప్లాంట్‌లో ఎయిర్ సపరేషన్ యూనిట్ ఏర్పాటు కోసం, ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

    ప్రైస్‌ బాండ్‌:ఐపీవో ధరల శ్రేణి(Price band)ని ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 380 నుంచి రూ. 400 గా కంపెనీ నిర్ణయించింది. ఒక లాట్‌లో 37 షేర్లుంటాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు ఒక లాట్‌ కోసం రూ. 14,800 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

    ముఖ్యమైన తేదీలు:ఐపీవో మంగళవారం ప్రారంభం కానుంది. గురువారం వరకు సబ్‌స్క్రిప్షన్‌(Subscription) స్వీకరిస్తారు. శుక్రవారం రాత్రి ఐపీవో అలాట్‌మెంట్‌ స్టేటస్‌ వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ఈ కంపెనీ షేర్లు వచ్చేనెల ఒకటో తేదీన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్‌ కానున్నాయి.

    వాటా:క్యూఐబీ(QIB)లకు 50 శాతం, ఎన్‌ఐఐ(NII)లకు, 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం వాటా కేటాయించారు.

    జీఎంపీ:ఈ కంపెనీ షేర్లకు జీఎంపీ(GMP) రూ. 7 మాత్రమే ఉంది. అంటే లిస్టింగ్‌ రోజు 1.75 శాతమే లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.

    More like this

    IPO | ఐపీవోకు మంగళ సూత్రాల తయారీ కంపెనీ.. నేడు సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPO | మంగళసూత్రాలు తయారు చేసే శ్రింగార్‌ హౌస్‌ ఆఫ్‌ మంగళసూత్ర ఐపీవోకు వచ్చింది....

    Terrorists Arrest | ఐసిస్ ఉగ్ర‌వాదుల‌ అరెస్టు.. రాంచీ, ఢిల్లీలో ప‌ట్టుబ‌డిన నిందితులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terrorists Arrest | ఉగ్ర‌వాద నిరోధ‌క చ‌ర్య‌ల్లో భ‌ద్ర‌తా ద‌ళాలు కీల‌క విజ‌యం సాధించాయి....

    Donald Trump | ట్రంప్ వైఖ‌రిలో స్ప‌ష్ట‌మైన మార్పు.. మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నాన‌ని వెల్ల‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump | భార‌త్ ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...