Homeబిజినెస్​IPO | మెయిన్ బోర్డునుంచి మరో ఐపీవో.. రేపటి నుంచి ప్రారంభం

IPO | మెయిన్ బోర్డునుంచి మరో ఐపీవో.. రేపటి నుంచి ప్రారంభం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: IPO | మెయిన్ బోర్డు(Main board)నుంచి మరో ఐపీవో వస్తోంది. శుక్రవారం నుంచి సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం కానుంది. డొమెస్టిక్(Domestic), అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కోసం సోలార్ పంప్స్, సబ్ మెర్సిబుల్ పంప్స్, మోనో బ్లాక్ పంప్స్, ప్రెజర్ పంప్స్, సీవేజ్ పంప్స్, ఎలక్ట్రిక్ మోటార్స్(Electric motors), సబ్‌మెర్సిబుల్ వైండింగ్ వైర్స్, కేబుల్స్, ఎలక్ట్రిక్ ప్యానెల్స్ వంటి వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసి, పంపిణీ చేసే ఓస్వాల్ పంప్స్ లిమిటెడ్ పబ్లిక్‌ ఆఫర్‌కు వస్తోంది.

మార్కెట్‌ నుంచి రూ.1,387.34 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఉంది. ఇందులో ఫ్రెష్ ఇష్యూ(Fresh issue) కింద రూ.1 ఫేస్ వ్యాల్యూ కలిగిన 1.44 కోట్ల షేర్లను విక్రయించి రూ.890 కోట్లు సమీకరించనుంది. ఆఫర్ ఫర్ సేల్(OFS) కింద రూ.1 ఫేస్ వ్యాల్యూ కలిగిన 81 లక్షల షేర్లను విక్రయించి రూ.497.34 కోట్లను పొందాలని భావిస్తోంది. ఐపీవో(IPO) ద్వారా వచ్చిన ఆదాయాన్ని క్యాపిటల్ ఎక్సెపెండిచర్​ కోసం, కంపెనీ రుణాలను చెల్లించడం కోసం, అనుబంధ సంస్థలలో పెట్టుబడుల కోసం, హర్యానాలో కొత్త మ్యాన్​ఫాక్చరింగ్​ యూనిట్ ఏర్పాటు కోసం, ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

IPO | కంపెనీ ఆర్థిక పరిస్థితి..

2023 -24 ఆర్థిక సంవత్సరంలో రూ. 761.23 కోట్ల ఆదాయాన్ని(Revenue) సంపాదించింది. రూ. 511.28 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలలకు కంపెనీ రూ. 1,067.34 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. రూ. 216.71 కోట్ల నికర లాభాన్ని పొందింది. ఆస్తులను రూ. 511 కోట్లనుంచి రూ. 1,096.01 కోట్లకు పెంచుకుంది.

IPO | సబ్‌స్క్రిప్షన్‌ వివరాలు..

ఐపీవో సబ్‌స్క్రిప్షన్(Subscription) శుక్రవారం ప్రారంభమై 17వ తేదీన ముగుస్తుంది. 18న అలాట్‌మెంట్‌ స్టేటస్‌ విడుదలయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు 20న బీఎస్‌ఈ(BSE), ఎన్‌ఎస్‌ఈ(NSE)లలో లిస్ట్‌ అవుతాయి.

IPO | ప్రైస్ బ్యాండ్

ఓస్వాల్ పంప్స్ లిమిటెడ్ ఐపీవో ప్రైస్ బ్యాండ్(Price band) ఒక షేరుకు 584 నుంచి రూ. 614గా నిర్ణయించింది. లాట్‌(Lot)లో 24 షేర్లుంటాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు రూ. 14,736తో బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.

IPO | కోటా, జీఎంపీ

పబ్లిక్ ఇష్యూలో 50 శాతం క్యూఐబీ(QIB)లకు, 15 శాతం ఎన్‌ఐఐ(NII)లకు రిజర్వ్‌ చేశారు. రిటైల్‌ కోటా 35 శాతం కేటాయించారు. ప్రస్తుతం ఈ కంపెనీకి ‍గ్రే మార్కెట్‌ ప్రీమియం(GMP) 16 శాతం ఉంది.