Belrise Industries IPO | మెయిన్‌ బోర్డునుంచి మరో ఐపీవో.. రేపటినుంచే subscription ప్రారంభం

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Belrise Industries IPO | దేశీయ ఆటోమోటివ్ కాంపోనెంట్(Domestic automotive components) తయారీ సంస్థ అయిన బెల్రైజ్ ఇండస్ట్రీస్ ఇన్వెస్టర్లనుంచి రూ. 2,150 కోట్ల నిధులను సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వస్తోంది. ఈ ప్రక్రియ పూర్తి తాజా షేర్లు జారీ ద్వారా జరగనుంది. ఇష్యూలో భాగంగా 23.89 కోట్ల తాజా షేర్లు జారీ చేయనున్నారు. ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ (IPO subscription) ఈనెల 21 న ప్రారంభమై 23తో ముగియనుంది. మే 28న ఇది బీఎస్‌ఈ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Belrise Industries IPO | దేశీయ ఆటోమోటివ్ కాంపోనెంట్(Domestic automotive components) తయారీ సంస్థ అయిన బెల్రైజ్ ఇండస్ట్రీస్ ఇన్వెస్టర్లనుంచి రూ. 2,150 కోట్ల నిధులను సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వస్తోంది. ఈ ప్రక్రియ పూర్తి తాజా షేర్లు జారీ ద్వారా జరగనుంది. ఇష్యూలో భాగంగా 23.89 కోట్ల తాజా షేర్లు జారీ చేయనున్నారు. ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ (IPO subscription) ఈనెల 21 న ప్రారంభమై 23తో ముగియనుంది. మే 28న ఇది బీఎస్‌ఈ (BSE), ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్ కానుంది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా వచ్చే నికర ఆదాయాన్ని కంపెనీ అప్పుల ముందస్తు చెల్లింపు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.

Belrise Industries IPO | ధరల శ్రేణి..

కంపెనీ ధరల శ్రేణిని (Price band) రూ.85 నుంచి రూ. 90 గా నిర్ణయించింది. ఒక లాట్‌(Lot)లో 166 షేర్లుంటాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు (retail investors) ఒక లాట్‌ కోసం రూ. 14,940తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిటైల్‌కోటా 35 శాతం కేటాయించారు.

Belrise Industries IPO | కంపెనీ వివరాలు..

బెల్రైజ్ ఇండస్ట్రీస్‌ కంపెనీని (belrise industries company) 1988లో స్థాపించారు. ఇది వివిధ రకాల భద్రతా వ్యవస్థలను అందిస్తుంది. బైక్‌లు, ఆటోలు, కార్లు ఇతర వాణిజ్య వాహనాలు, వ్యవసాయ వాహనాల కోసం ఆటోమోటివ్ షీట్ మెటల్, కాస్టింగ్, పాలిమర్ భాగాలు, సస్పెన్షన్, మిర్రర్ సిస్టమ్‌లను తయారు చేస్తుంది.

Belrise Industries IPO | GMP..

గ్రే మార్కెట్‌ ప్రీమియం (grey market premium) రూ. 8గా ఉంది. అంటే లిస్టింగ్‌ రోజే 9 శాతం లాభాలను అందించే అవకాశాలున్నాయి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...