అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Glottis IPO | లాజిస్టిక్ సర్వీస్ ప్రొవైడర్ (Logistic service provider) అయిన గ్లాటిస్ లిమిటెడ్ ఐపీవోకు వస్తోంది. కంపెనీ సబ్‌స్క్రిప్షన్ 29న ప్రారంభమై ఒకటో తేదీన ముగియనుంది. ఈ కంపెనీ షేర్లకు జీఎంపీ రూ. 15గా ఉంది.
చైన్నైలో మల్టీ మోడల్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్‌గా సుపరిచితమైన గ్లాటిస్ లిమిటెడ్ (Glottis Ltd.) 2004లో ప్రారంభమైంది. కంపెనీ సముద్ర, వాయు, రోడ్డు రవాణా, వేర్ హౌసింగ్, కార్గో హ్యాండ్లింగ్, 3పీఎల్ సొల్యూషన్స్, కస్టమ్స్ క్లియరెన్స్ సర్వీసెస్ అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఎనిమిది శాఖలను కలిగి ఉన్న ఈ కంపెనీ.. ఆసియాతోపాటు యూరోప్, అమెరికా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్‌లలో టైఅప్‌లు కలిగి ఉంది.
ప్రస్తుతం రెన్యువబుల్ ఎనర్జీ సప్లై చైన్ సొల్యూషన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ కంపెనీ ఐపీవో(IPO) ద్వారా రూ. 307 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఫ్రెష్ ఇష్యూ(Fresh issue) రూ. 160 కోట్లు కాగా.. మిగిలినది ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నారు. కొత్త షేర్ల జారీ ద్వారా వచ్చే నిధులను వాణిజ్య వాహనాలు, కంటైనర్ల కొనుగోలుతోపాటు సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం ఉపయోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.
Glottis IPO | ఫైనాన్షియల్ రిపోర్ట్..
2023-24 ఆర్థిక సంవత్సరంలో గ్లాటిస్ రూ. 499 కోట్ల ఆదాయం(Revenue), రూ. 30.96 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 942.55 కోట్లకు, నికర లాభం(Net profit) రూ. 56.14 కోట్లకు పెరిగాయి. ఆస్తులు రూ. 81.72 కోట్లనుంచి రూ. 156.10 కోట్లకు చేరాయి.
Glottis IPO | ధరల శ్రేణి..
కంపెనీ ధరల శ్రేణి(Price band)ని ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 120 నుంచి రూ. 129గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 114 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు గరిష్ట ప్రైస్ బాండ్ వద్ద ఒక లాట్ కోసం రూ. 14,706 తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిటైల్ కోటాలో గరిష్టంగా 13 లాట్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Glottis IPO | కోటా, జీఎంపీ..
రిటైల్ ఇన్వెస్టర్లకు 40 శాతం, క్యూఐబీ(QIB)లకు 30 శాతం, ఎన్‌ఐఐలకు 30 శాతం కోటా కేటాయించారు. ఈ కంపెనీ షేర్లకు జీఎంపీ రూ. 15 ఉంది. అంటే లిస్టింగ్ సమయంలో ఐపీవో అలాట్ అయినవారికి 11 శాతం వరకు లాభం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Glottis IPO | ముఖ్యమైన తేదీలు..
పబ్లిక్ ఇష్యూ(Public issue) ఈనెల 29 న ప్రారంభమవుతుంది. అక్టోబర్ ఒకటో తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. మూడో తేదీన షేర్ల అలాట్‌మెంట్ స్టేటస్ తెలిసే అవకాశాలుంటాయి. కంపెనీ షేర్లు అక్టోబర్ 7న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి.