అక్షరటుడే, వెబ్డెస్క్ : Park Medi World IPO | పార్క్ హాస్పిటల్స్ బ్రాండ్ (Park Hospitals Brand) పేరుతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్వహిస్తున్న పార్క్ మెడి వరల్డ్.. కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్ (Orthopedics), న్యూరాలజీ మరియు నెఫ్రాలజీ వంటి వివిధ విభాగాలలో అత్యవసర సంరక్షణ, డయాగ్నోస్టిక్స్, శస్త్రచికిత్సలు, ప్రత్యేక చికిత్సలతో సహా విస్తృత శ్రేణి వైద్య సేవలను అందిస్తోంది.
ఆధునిక మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన వైద్య నిపుణులతో అర్బన్, సెమీఅర్బన్ ప్రాంతాలలో హాస్పిటల్స్ నిర్వహిస్తోంది. తన సేవలను విస్తృతం చేయడం కోసం ఈ కంపెనీ స్టాక్ మార్కెట్‌లో అడుగిడుతోంది.రూ. 920 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఈ కంపెనీ ఐపీవో (IPO)కు వస్తోంది. ఇందులో ఫ్రెష్ ఇష్యూ రూ. 770 కోట్లు.. ఆఫర్ ఫర్ సేల్ రూ. 150 కోట్లు సమీకరించనున్నారు. ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని రుణాల తిరిగి చెల్లింపు/ముందస్తు చెల్లింపు, మూలధన వ్యయం అవసరం, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలకోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపిది.
Park Medi World IPO | ముఖ్యమైన తేదీలు..
డిసెంబర్ 10న ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ప్రారంభమవుతుంది. బిడ్ వేయడానికి గడువు డిసెంబర్ 12న ముగుస్తుంది. షేర్ల అలాట్‌మెంట్ స్టేటస్ 15 న రాత్రి వెల్లడయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు ఈనెల 17న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి.
Park Medi World IPO | ధరల శ్రేణి..
షేరు ధరను కంపెనీ రూ. 154 నుంచి రూ. 162 మధ్య నిర్ణయించింది. ఒక లాట్(Lot)లో 92 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 14,904తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. గరిష్టంగా 13 లాట్‌లకు బిడ్ వేయవచ్చు.
Park Medi World IPO | కోటా, జీఎంపీ..
క్యూఐబీలకు 50 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం కోటా కేటాయించారు. ఈ కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్ ప్రీమియం రూ. 29 ఉంది. లిస్టింగ్ సమయంలో 18 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.