అక్షరటుడే, వెబ్డెస్క్: Bangladesh | బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు (Attacks on Hindus) ఆగడం లేదు. తాజాగా మరో హిందు యువకుడిని హత్య చేశారు.
హిందు యువకుడిని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (Bangladesh Nationalist Party) నేత అబుల్ హషేమ్ కారుతో ఢీకొట్టి చంపాడు. రిపోన్ సాహా అనే వ్యక్తి పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. అయితే కారులో పెట్రోల్ కొట్టించుకుని డబ్బులు ఇవ్వకుండా వెళ్లేందుకు అబుల్ యత్నించాడు. పెట్రోల్ డబ్బు ఇవ్వాలని రిపోన్ సాహా కారు వెంట పడటంతో అతడిని ఢీకొని అబుల్ హషేమ్ వెళ్లిపోయాడు. దీంతో సాహా అక్కడికక్కడే మృతి చెందాడు.
Bangladesh | నిందితుల అరెస్ట్
రాజ్‌బరి జిల్లాలో ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. సంఘటన జరిగిన సమయంలో అతను గోలందా మోర్‌లోని కరీం ఫిల్లింగ్ స్టేషన్‌లో పనిచేస్తున్నాడని తెలిసింది. వారు ఇంధనానికి డబ్బులు చెల్లించడానికి నిరాకరించడంతో ఆ కార్మికుడు కారు ముందు నిలబడ్డట్లు పోలీసులు తెలిపారు. అయితే వారు అతనిపై నుంచి కారును తీసుకు వెళ్లడంతో చనిపోయాడన్నారు. పోలీసులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకుని, యజమాని అబుల్ హషీమ్ అలియాస్ సుజన్, అతని డ్రైవర్ కమల్ హుస్సేన్ను అరెస్ట్ చేశారు. రాజ్‌బరి జిల్లా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) మాజీ కోశాధికారి, జిల్లా జుబో దళ్ మాజీ అధ్యక్షుడైన హషీమ్ వృత్తిరీత్యా కాంట్రాక్టర్ అని పోలీసులు తెలిపారు.