అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | హైదరాబాద్(Hyderabad) నగరంలోని పాత బస్తీలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొఘల్‌పురాలోని(Mughalpura) ఓ గోదాంలో గురువారం ఉదయం మంటలు అంటుకున్నాయి. నివాసాల మధ్య ఉన్న కార్టూన్ గోదాంలోని(Cartoon Warehouse) గ్రౌండ్‌ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. భవనంలో ఉన్న తొమ్మిది మందిని ఫైర్ సిబ్బంది రక్షించారు. కాగా.. ఇటీవల పాతబస్తీలోని మీర్చౌక్లో గల గుల్జార్ హౌస్‌లో అగ్నిప్రమాదం(Fire Accident) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 17 మంది మరణించారు. ఓల్డ్ సిటీలో వరుస ఫైర్ యాక్సిడెంట్లతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.