అక్షరటుడే, వెబ్‌డెస్క్: Chhattisgarh Encounter | ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. దంతేవాడ–బీజాపూర్ (Dantewada and Bijapur) మధ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు.
బీజాపూర్ జిల్లాలో బుధవారం భద్రతా సిబ్బందికి (security forces), నక్సలైట్లకు (Naxalites) మధ్య ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. పశ్చిమ బస్తర్ డివిజన్‌లోని అడవిలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు బలగాలు కూంబింగ్ చేపట్టాయి. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రాకు చెందిన సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో దంతేవాడ, బీజాపూర్ సరిహద్దుల్లోని భైరామ్‌గఢ్ ప్రాంతంలోని కేశ్‌కుతుల్ అడవుల్లో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది.
Chhattisgarh Encounter | కొనసాగుతున్న కూంబింగ్
ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా దళాల నిరంతర చర్యల కారణంగా మావోయిస్టులు భయాందోళనకు గురవుతున్నారు. చాలా మంది మావోయిస్టులు లొంగిపోయారు. మరికొందరు ఇప్పటికీ ఒత్తిడిలో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోలు చనిపోయారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
Chhattisgarh Encounter | ఆపరేషన్ వేగవంతం
దేశంలో 2026 మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఆపరేషన్ కగార్ చేపట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్ కగార్ (Operation Kagar) ధాటికి వందలాది మంది మావోయిస్ట్‌లు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. బలగాల ఒత్తిడితో చాలా మంది లొంగిపోతున్నారు. ప్రభుత్వాలు సైతం లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం లొంగిపోయే వారి కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. దీంతో మావోయిస్ట్ పార్టీ బలహీనంగా మారింది. ఇప్పటికే పలువరు కీలక నేతలు ఎన్కౌంటర్లో హతం అయ్యారు. మరికొందరు లొంగిపోయారు. ఈ క్రమంలో బలగాలు ఆపరేషన్‌ను వేగవంతం చేశాయి. నిరంతరం కూంబింగ్ చేపడుతున్నాయి.
