HomeజాతీయంChhattisgarh Encounter | ఛత్తీస్​గఢ్​లో మరోసారి ఎన్​కౌంటర్​.. 20కి చేరిన మృతులు

Chhattisgarh Encounter | ఛత్తీస్​గఢ్​లో మరోసారి ఎన్​కౌంటర్​.. 20కి చేరిన మృతులు

ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య మరోసారి ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 8 మంది నక్సల్స్​ చనిపోయారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chhattisgarh Encounter | ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య మరోసారి ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. బుధవారం జరిగిన ఎన్​కౌంటర్​లో 12 మంది మావోయిస్టులు (Maoists) మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం మరో 8 మంది చనిపోయారు.

బీజాపుర్‌-దంతెవాడ సరిహద్దు అడవుల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు బుధవారం ఉదయం బలగాలు సెర్చ్​ ఆపరేషన్​ (Search operation) చేపట్టాయి. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రాకు చెందిన సిబ్బంది ఆపరేషన్​లో పాల్గొన్నారు. ఈ క్రమంలో బుధవారం ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. 12 మంది మావోలు, ముగ్గురు జవాన్లు ఎన్​కౌంటర్​లో చనిపోయారు. ఎన్​కౌంటర్​ నేపథ్యంలో భారీగా బలగాలను ఆ ప్రాంతానికి తరలించారు.

Chhattisgarh Encounter | కీలక నేతలు

మావోల కోసం గురువారం కూంబింగ్​ (Coombing) చేపట్టగా మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 8 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 20కి చేరింది. మృతుల్లో PLGA-2 కమాండర్ వెల్ల మోడియం ఉన్నట్లు గుర్తించారు. ఇంకా కూంబింగ్​ కొనసాగుతోంది. దక్షిణ బస్తర్ ప్రాంత పోలీసు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (Deputy Inspector General) కమ్లోచన్ కశ్యప్ గురువారం మరో ఆరు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ధ్రువీకరించారు. హతమైన నక్సలైట్ల నుంచి భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని, AK-47, INSAS రైఫిల్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నాయి.

ఈ సంవత్సరం ఛత్తీస్‌గఢ్‌లో 275 మంది నక్సలైట్లను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వీరిలో 246 మంది బస్తర్ ప్రాంతంలో, 27 మంది గరియాబంద్ జిల్లాలో, ఇద్దరు మొహ్లా-మన్‌పూర్-అంబాఘర్ చౌకి జిల్లాలో మరణించారు. మరోవైపు, ఈ సంవత్సరం రాష్ట్రంలో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలలో 23 మంది భద్రతా దళాల సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

Must Read
Related News