అక్షరటుడే, వెబ్‌డెస్క్: Amrit Bharat Express | కేంద్ర ప్రభుత్వం (Central Government) తెలంగాణకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కేటాయించింది. కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం నుంచి హైదరాబాద్ దగ్గర్లోని చర్లపల్లి టెర్మినల్ వరకు ఈ రైలు నడవనుంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) శుక్రవారం కేరళలో నాలుగు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఇందులో తిరువనంతపురం నుంచి చర్లపల్లి రైలు కూడా ఉంది. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం ఒక అమృత్ భారత్ రైలు నడుస్తోంది. మొదటి రైలు15294/93 చర్లపల్లి నుంచి ముజఫఫ్పూర్ మార్గంలో రాకపోకలు సాగిస్తోంది. తాజాగా మరొక అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలు చర్లపల్లి నుంచి తిరువనంతపురం (Cherlapally to Thiruvananthapuram) మధ్య సేవలు అందించనుంది.
Amrit Bharat Express | వీక్లీ ఎక్స్‌ప్రెస్
తిరువనంతపురం–చర్లపల్లి మధ్య అమృత్ భారత్ రైలు వారానికి ఒకసారి నడవనుంది. రెగ్యులర్ 17041 చర్లపల్లి నుంచి వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు ప్రతి మంగళవారం ఉదయం 7:15 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ప్రతి బుధవారం మధ్యాహ్నం 2:45 నిమిషాలకు తిరువనంతపురం ఉత్తరం (కొచ్చువేలి) రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. 17042 రైలు తిరువనంతపురం నుంచి బుధవారం సాయంత్రం 5:30 నిమిషాలకు బయలుదేరి గురువారం రాత్రి 11:30 నిమిషాలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ చేరుకుంటుంది.
ఈ రైలు తిరువనంతపురం కొచ్చువేలి రైల్వే స్టేషన్ (Kochuveli Railway Station)లో కేవలం 2 గంటల 45 నిమిషాలు ఖాళీగా ప్లాట్ఫారం పైన నిర్వహణ కోసం ఉంటుంది. ఈ రైలు ప్రాథమిక నిర్వహణ చర్లపల్లిలోని పిట్ లైన్లో నిర్వహిస్తారు. మొట్ట మొదటి సారి దక్షిణ మధ్య రైల్వే జోన్ కి అమృత్ భారత్ రైలు కేటాయించారు. ముజఫర్ పూర్ నుంచి చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ ఉన్నప్పటికీ ఇది తూర్పు మధ్య రైల్వే జోన్‌కి చెందిన రైలు. దీనికి ప్రాథమిక నిర్వహణ ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్ పిట్ లైన్లో నిర్వహిస్తారు.
Amrit Bharat Express | ఈ స్టేషన్లలో..
కొత్తగా ప్రారంభించే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ నల్గొండ – గుంటూరు – తెనాలి – గూడూరు – రేణిగుంట – కాట్పాడి – ఈరోడ్ – కోయంబత్తూరు – పాలక్కాడ్ – ఎర్నాకులం టౌన్ – కొట్టాయం – కాయంకులం రైల్వే స్టేషన్ ల మీదుగా వెళ్తుంది. అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు మన తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ, మిర్యాలగూడ రైల్వే స్టేషన్లలో హాల్ట్ సదుపాయం కల్పించారు. ఈ రైలులో 11 జనరల్ (సాధారణ బోగీలు ), 8 స్లీపర్ బోగీలు ఉండనున్నాయి. వలస కార్మికులు, అత్యంత దూరం ప్రయాణించే పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని వీటిని ప్రారంభిస్తున్నారు.