Homeఆంధప్రదేశ్Andhra Pradesh | ఏపీ చికెన్ వ్యాపారులు ఇది గ‌మ‌నించారా.. ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం

Andhra Pradesh | ఏపీ చికెన్ వ్యాపారులు ఇది గ‌మ‌నించారా.. ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం

Andhra Pradesh | ఏపీలో చికెన్ దుకాణాలకు లైసెన్స్ తప్పనిసరి, ప్రజలకు నాణ్యమైన చికెన్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం. పౌల్ట్రీ నుంచి దుకాణం వరకు కోళ్ల సరఫరాపై పర్యవేక్షణ చేపట్టనుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని చికెన్ వ్యాపారం (Chicken Business)పై కఠిన చర్యలు ప్రారంభించింది. ప్రజలకు పరిశుభ్రమైన, నాణ్యమైన మాంసాన్ని అందించడం, అక్రమ వ్యాపారాలకు అడ్డుగట్టడం లక్ష్యంగా చికెన్ దుకాణాలకు లైసెన్సింగ్ విధానాన్ని తప్పనిసరిగా విధించనుంది.

ఈ నిర్ణయం ద్వారా కోళ్ల సరఫరా వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వ పర్యవేక్షణలోకి తీసుకురావడం సాధ్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఏ పౌల్ట్రీ ఫారం నుంచి ఎన్ని కోళ్లు ఏ దుకాణానికి వెళ్తున్నాయి, రోజువారీ అమ్మకపు వివరాలు వంటి సమాచారాన్ని త‌ప్ప‌కుండా నమోదు చేయించాల్సి ఉంటుంది. దీంతో కోళ్ల ఉత్పత్తి నుంచి వినియోగదారికి చేరే ప్రతి దశను ట్రాక్ చేయడం సులభమవుతుందని అధికారులు తెలిపారు.

Andhra Pradesh | నాణ్యమైన చికెన్ అందించడం కోసం..

అదనంగా, ఆరోగ్యానికి హానికరమైన స్టెరాయిడ్లు (Harmful Steroids), అనుమతించని రసాయనాలను వాడి పెంచిన కోళ్ల విక్రయాలను పూర్తిగా నియంత్రించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గుర్తింపు పొందిన, లైసెన్స్ ఉన్న దుకాణాల నుంచి మాత్రమే హోటళ్లు, రెస్టారెంట్లు మాంసం కొనుగోలు చేయడం కోసం ప్రోత్సాహక చర్యలు తీసుకోవడం జరుగుతున్నాయి. ఇంకా, చికెన్ దుకాణాల (Chicken Shops) నుండి వ్యర్థాలను అక్రమంగా సేకరించి, వాటిని చేపల మేతలో ఉపయోగించే మాఫియా కార్యకలాపాలను కూడా ఈ విధానం ద్వారా అరికట్టగలమని అధికారులు భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో, రాష్ట్రంలోని అన్ని చికెన్ దుకాణాలు తప్పనిసరిగా లైసెన్స్ (License) పొందాలి అని ఆంధ్రప్రదేశ్ మాంసాభివృద్ధి సంస్థ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

ప్రభుత్వం యొక్క ఈ కొత్త చర్యలతో, ప్రజలకు నాణ్యమైన, పరిశుభ్రమైన చికెన్ అందించడం, అక్రమ, అస్వచ్ఛమైన వ్యాపారాలను అరికట్టడం, అలాగే కోళ్ల సరఫరా వ్యవస్థను సమగ్రంగా పర్యవేక్షించడం సాధ్యమని అధికారులు తెలిపారు.ఏపీ ప్ర‌భుత్వం (Andhra Pradesh Government) తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం అవుతుంది. ఇదే పాల‌సీ ఇత‌ర రాష్ట్రాల‌లో కూడా తీసుకొస్తే బాగుంటుంద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.