అక్షరటుడే, హైదరాబాద్: Anasuya : యాంకర్, టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. సామాజిక మాధ్యమాల్లో గత కొంతకాలంగా తనపై కొనసాగుతున్న లైంగిక దూషణలు, అశ్లీల దాడులు, బెదింపులు, వ్యక్తిత్వ హననంపై అనసూయ చట్టపరంగా పోరాటానికి దిగారు. తాజాగా ఆమె సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనపై సామాజిక మాధ్యమాల్లో వేధింపులు ఎక్కవ అయ్యాయని ఫిర్యాదు చేశారు. తనను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Anasuya : నటుడు శివాజీ వ్యాఖ్యల తర్వాత..
అనసూయ ఫిర్యాదు వివరాల ప్రకారం.. డిసెంబర్ 22, 2025న జరిగిన ఒక కార్యక్రమంలో నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తర్వాతి రోజు కొందరు మీడియా ప్రతినిధులు ఈ విషయంపై అనసూయ స్పందన కోరారు. ఈ సందర్భంగా అనసూయ స్పందిస్తూ.. వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో నచ్చిన దుస్తులు ధరించే హక్కు ఉంటుందంటూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలే సామాజిక మాధ్యమాల్లో ఆమెపై మూకుమ్మడి దాడికి కారణమైనట్లు ఫిర్యాదులో వివరించినట్లు సమాచారం.
Anasuya : ఏకంగా 42 మందిపై..
పోలీసులు 22 పేజీల FIR రూపొందించినట్లు సమాచారం. మొత్తం 42 మంది నిందితులపై కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. నిందితుల్లో ప్రముఖులు, అడ్వకేట్లు, కంటెంట్ క్రియేటర్లు, సామాజిక మాధ్యమాల హ్యాండిల్స్ సైతం ఉన్నట్లు తెలుస్తోంది. ఏఐని దుర్వినియోగం చేస్తూ తన ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీలంగా మార్చారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.