అక్షరటుడే, వెబ్‌డెస్క్: Anasuya Bharadwaj | సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) తాజాగా ఓ జూమ్ కాల్ లో జరిగిన ప్రెస్‌మీట్‌లో భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. తన వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని సాగుతున్న విమర్శలు, ట్రోలింగ్ తనను తీవ్రంగా ప్రభావితం చేశాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
దుస్తులు మాత్రమే కాదు, చీర కట్టుకుని వచ్చిన సందర్భాల్లో కూడా తనను ట్రోల్ చేసిన ఘటనలు ఉన్నాయని పేర్కొంటూ, ఎంత ధైర్యంగా కనిపించినా తానూ ఒక మనిషినేనని, ఓ మహిళనే అని భావోద్వేగంగా మాట్లాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో (social media) వైరల్ కావడంతో దీనిపై స్పందించిన అనసూయ, ఒక మనిషిగా భావోద్వేగానికి లోనవ్వడంలో తనకు ఎలాంటి సిగ్గు లేదని ఇన్‌స్టాగ్రామ్‌లో స్పష్టత ఇచ్చారు.
Anasuya Bharadwaj | జూమ్ కాల్‌లో కన్నీళ్లు..
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో తనకు లభించిన మద్దతు చూసి ఆ బలహీన క్షణంలో కన్నీళ్లు ఆపుకోలేకపోయానని చెప్పిన ఆమె, ఇప్పుడు పూర్తిగా కోలుకున్నానని అభిమానులకు Fans భరోసా ఇచ్చారు. మహిళలు తమ స్వయంప్రతిపత్తికి గొంతు వినిపించినందుకే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించిన అనసూయ, అయినప్పటికీ బలమైన స్త్రీల సంఘీభావం తనకు మరింత శక్తినిస్తోందని అన్నారు. ఒకరి బలహీన క్షణాలను ఆసరాగా చేసుకుని ట్రోల్ చేయడం వారి స్వభావాన్ని మాత్రమే చూపిస్తుందని, తనను మాత్రం అవి ఆపలేవని స్పష్టం చేశారు.
ఎలక్ట్రానిక్ మీడియాలోని (Electronic Media) కొన్ని వర్గాలపై నిరాశ కలిగినప్పటికీ న్యాయవ్యవస్థపై తన నమ్మకం చెక్కుచెదరలేదని చెప్పిన అనసూయ, క్లిక్‌బైట్ కథనాలు, ఊహాగానాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టిన నేపథ్యంలో ఎదురైన ట్రోలింగ్ తనను ఈ స్థాయిలో స్పందించాల్సి వచ్చిందని పేర్కొంటూ, సమస్య దుస్తుల్లో కాదు, ఆలోచనల్లో ఉందని అనసూయ స్పష్టమైన సందేశం ఇచ్చారు. ప్రస్తుతం అనసూయ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.