అక్షరటుడే, వెబ్డెస్క్ : Nalgonda | నల్గొండ జిల్లాలో బస్సు ప్రమాదం (bus accident) చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లోని (Andhra Pradesh) తిరువూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నల్గొండ జిల్లా (Nalgonda district) కొర్లపాడు దగ్గర ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో క్షతగాత్రులను నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి (Nakirekal Government Hospital) తరలించారు.
Nalgonda | భయపెడుతున్న బస్సు ప్రమాదాలు
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల బస్సు ప్రమాదాలు పెరిగాయి. దీంతో ప్రయాణికులు భయపడుతున్నారు. ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాల బారిన పడుతున్నాయి. చలికాలం కావడంతో తెల్లవారుజామున ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. దీంతో జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రస్తుతం సంక్రాంతి నేపథ్యంలో ప్రజలు ఊళ్లకు పయనం అవుతున్నారు. దీంతో రోడ్లపై వాహనాల రద్దీ నెలకొంది. ఈ క్రమంలో ప్రమాదాల జరగకుండా నిబంధనలు పాటించాలని పోలీసులు కోరుతున్నారు.
Nalgonda | జాగ్రత్తగా వెళ్లి క్షేమంగా రండి
సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్తున్న ప్రజలను అప్రమత్తంగా ఉండాలని గులాబీ ఇచ్చి సూర్యాపేట ఎస్పీ నరసింహ జాగ్రత్తలు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు నిర్లక్ష్యం వహించకుండా వెంటనే పోలీస్ శాఖకు సమాచారం అందించాలని కోరారు. వాహనదారులు నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.