HomeజాతీయంRahul Gandhi | ఐపీఎస్​ అధికారి ఆత్మహత్యపై విచారణ జరపాలి : రాహుల్​ గాంధీ

Rahul Gandhi | ఐపీఎస్​ అధికారి ఆత్మహత్యపై విచారణ జరపాలి : రాహుల్​ గాంధీ

Rahul Gandhi | హర్యానాలో ఐపీఎస్​ అధికారి పూరన్​కుమార్​ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని రాహుల్​ గాంధీ డిమాండ్​ చేశారు. బాధిత కుటుంబాన్ని ఆయన మంగళవారం పరామర్శించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gandhi | ఐపీఎస్​ అధికారి పూరన్​కుమార్​ ఆత్మహత్యపై తక్షణమే విచారణ జరపాలని లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ డిమాండ్​ చేశారు. ఛండీగఢ్‌లోని (Chandigarh) పూరన్ కుమార్ ఇంటికి మంగళవారం ఆయన వెళ్లారు. ఐపీఎస్​ అధికారి కుటుంబాన్ని పరామర్శించారు.

హర్యానా కేడర్​కు చెందిన పూరన్​కుమార్​ ఈ నెల 7న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉన్నతాధికారుల వేధింపులే ఆత్మహత్యకు కారణమని సూసైడ్​ లేఖ రాశారు. ఈ క్రమంలో మంగళవారం ఆయన కుటుంబాన్ని రాహుల్​ గాంధీ (Rahul Gandhi) పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పూరన్ ఆత్మహత్యపై తక్షణమే విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని (Central Government) డిమాండ్​ చేశారు.

Rahul Gandhi | ఆరేళ్లుగా వివక్ష

దళిత కుటుంబానికి చెందిన పూరన్​పై ఆరేళ్లుగా వివక్ష చూపారని రాహుల్​ గాంధీ ఆరోపించారు. ఓ ఐపీఎస్ అధికారి (IPS Officer Pooran Kumar) ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో ప్రపంచానికి తెలియాలన్నారు. ఈ కేసులో చర్య తీసుకోవాలని హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని (PM Narendra Modi) ఆయన కోరారు. డీజీపీని రక్షించే డ్రామాలను బీజేపీ ఆపాలన్నారు. ఈ ఘటన ‘‘ఎంత విజయం సాధించినా.. మీరు దళితుడైతే అణిచివేయవచ్చు” అనే తప్పుడు సందేశాన్ని దళితులకు పంపిందని ఆయన పేర్కొన్నారు. ఇది ఐపీఎస్ అధికారి కుటుంబం గౌరవానికి సంబంధించినది మాత్రమే కాదని, దళితులందరికీ సంబంధించినదని అని పేర్కొన్నారు. ఐపీఎస్ కుమార్తెల పట్ల నిబద్ధతను నెరవేర్చండి, ఆయన అంత్యక్రియలు జరగనివ్వండి అని ఆయన కోరారు.