అక్షరటుడే, నిజామాబాద్ క్రైం : Excise Police | గంజాయి బ్యాచ్‌ను పట్టుకునే క్రమంలో ఓ మహిళ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నిజామాబాద్ (Nizamabad) నగరంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.
Excise Police | పక్కా సమాచారంతో..
ఎక్సైజ్ కమిషనర్ సోమిరెడ్డి (Excise Commissioner Somireddy) తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి నగరంలోకి ఎండు గంజాయిని తీసుకొస్తున్నారనే పక్కా సమాచారంతో ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (Excise Circle Inspector) తన సిబ్బందితో రూట్ వాచ్ నిర్వహించారు. ఈ క్రమంలో నగరంలోకి అనుమానాస్పదంగా వచ్చిన కారురు ఆపాలని కోరాగా కారు డ్రైవర్ కారును ఆపకుండా ఎక్సైజ్ కానిస్టేబుల్ జి సౌమ్యను ఢీకొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ (Excise Constable) రోడ్డుపై పడిపోగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటన జరిగిన వెంటనే ఎక్సైజ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. పారిపోతున్న కారును పట్టుకొని అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి దగ్గర నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.