Homeబిజినెస్​Aequs IPO | ఆకర్షిస్తోన్న ఐపీవో.. జీఎంపీ ఎంతంటే?

Aequs IPO | ఆకర్షిస్తోన్న ఐపీవో.. జీఎంపీ ఎంతంటే?

కన్జూమర్‌ డ్యురబుల్‌ గూడ్స్‌, వైమానిక విడిభాగాల కాంట్రాక్ట్‌ తయారీ కంపెనీ ఏక్వస్‌(Aequs) పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. ఐపీవో ద్వారా రూ. 921.81 కోట్లు సమీకరించనుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Aequs IPO | కన్జూమర్‌ డ్యురబుల్‌ గూడ్స్‌, వైమానిక విడిభాగాల కాంట్రాక్ట్‌ తయారీ కంపెనీ ఏక్వస్‌ పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. ఐపీవో (IPO) ద్వారా రూ. 921.81 కోట్లు సమీకరించనుంది. రేపటినుంచి సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం కానుంది. ఈ కంపెనీ షేర్ల జీఎంపీ 35 శాతంగా ఉంది.

భారతదేశంలోని ఒకే ప్రత్యేక ఆర్థిక మండలంలో పనిచేస్తున్న ఏకైక ప్రెసిషన్‌ కాంపోనెంట్‌ తయారీదారు ఏక్వస్‌ లిమిటెడ్‌ (Aequs LTD). ఏరోస్పేస్‌ విభాగంలో ఇంటిగ్రేటెడ్‌ తయారీ సామర్థ్యాలను అందిస్తుంది. ప్రెసిషన్‌ కాంపోనెంట్‌లు అనేవి ఖచ్చితమైన యంత్రాలతో తయారు చేయబడిన భాగాలు. ఇవి ఖచ్చితమైన స్పెసిఫికేషన్‌లకు అనుగుణంగా రూపొందించబడి తయారు చేయబడతాయి. సాధారణంగా ఓఈఎం కస్టమర్‌లు మరియు సిస్టమ్‌ ఇంటిగ్రేటర్‌లకు సరఫరా చేయబడతాయి.

మార్చి 31, 2025 నాటికి కంపెనీ భారతదేశంలో అతిపెద్ద ఏరోస్పేస్‌ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలలో ఒకటి. దీని వైవిధ్యమైన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో ఇంజిన్‌ సిస్టమ్‌లు, ల్యాండిరగ్‌ సిస్టమ్‌లు (LandRug Systems), కార్గో మరియు ఇంటీరియర్‌లు, స్ట్రక్చర్‌లు, అసెంబ్లీలు మరియు ఏరోస్పేస్‌ క్లయింట్‌ల కోసం టర్నింగ్‌ కోసం భాగాలు ఉన్నాయి. ఏక్వస్‌ భారత్‌తోపాటు ఫ్రాన్స్‌, యూఎస్‌ఏలలో తయారీ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. బహుళ పరిశ్రమ విభాగాలలో తన ప్రపంచ కస్టమర్‌ బేస్‌కు ఉత్పత్తులను అందిస్తోంది. ఈ సంస్థకు కర్ణాటక (Karnataka)లో మూడు తయారీ క్లస్టర్లు ఉన్నాయి.

రూ.921.81 కోట్లు సమీకరించడం కోసం..

మార్కెట్‌నుంచి రూ.921.81 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఏక్వస్‌ లిమిటెడ్‌ కంపెనీ ఐపీవో(IPO)కు వస్తోంది. ఇందులో 5.40 కోట్ల తాజా షేర్లను జారీ చేయడం ద్వారా రూ.670 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌(OFS) ద్వారా 2.03 కోట్ల షేర్లను అమ్మడం ద్వారా రూ. 251.81 కోట్లు సమీకరించనుంది. ఐపీవో ద్వారా వచ్చే నిధులను అప్పుల చెల్లింపు, యంత్రాల కొనుగోలు, సంస్థ విస్తరణ కోసం ఉపయోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.

కంపెనీ ఆర్థిక పరిస్థితి..

2023 -24 ఆర్థిక సంవత్సరంలో రూ. 988.30 కోట్ల రెవెన్యూ ద్వారా రూ. 14.24 కోట్ల ప్యాట్‌ జనరేట్‌ చేయగా.. 2024 -25 ఆర్థిక సంవత్సరంలో రూ. 959.21 కోట్ల రెవెన్యూ ద్వారా రూ. 102.35 కోట్ల ప్యాట్‌ జనరేట్‌ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఇదే సమయంలో కంపెనీ ఆస్తులు రూ. 1,822.98 కోట్లనుంచి రూ. 1,859.84 కోట్లకు చేరాయి. కాగా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ చివరి నాటికి రూ. 565.55 కోట్ల ఆదాయం, రూ. 16.98 కోట్ల ప్యాట్‌ జనరేట్‌ అయ్యాయి. ఆస్తులు రూ. 2,134.35 కోట్లకు పెరిగాయి.

ప్రైస్‌ బ్యాండ్‌..

ఒక్కో షేరు ధరను రూ.118 నుంచి రూ. 124 మధ్యలో నిర్ణయించింది. ఒక లాట్‌లో 120 షేర్లున్నాయి. రిటైల్‌ ఇన్వెస్టర్ల ఒక లాట్‌ కోసం గరిష్ట ప్రైస్‌ బ్యాండ్‌ వద్ద రూ. 14,880తో బిడ్‌ వేయాల్సి ఉంటుంది. గరిష్టంగా 13 బిడ్లు వేయవచ్చు.

కోటా, జీఎంపీ..

క్యూఐబీ(QIB)లకు 75 శాతం, హెచ్‌ఎస్‌ఐలకు 15 శాతం, రిటైల్‌ ఇన్వెస్టర్లకు 10 శాతం షేర్లు కేటాయించారు. ఒక్కో ఈక్విటీ షేరుకు గ్రే మార్కెట్‌ ప్రీమియం రూ. 44గా ఉంది. అంటే ఐపీవో అలాట్‌ అయితే షేర్ల లిస్టింగ్‌ సమయంలో 35 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.

ముఖ్యమైన తేదీలు..

3న సబ్‌స్క్రిప్షన్‌(Subscription) ప్రారంభమవుతుంది. 5 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంటుంది. షేర్ల అలాట్‌మెంట్‌ స్టేటస్‌ 8వ తేదీ రాత్రి వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కంపెనీ షేర్లు కూడా డిసెంబర్‌ 10నే బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి.

Must Read
Related News