అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Railway Station | రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు ఓ యువకుడు జారిపడ్డాడు. దీంతో అతడి రెండుకాళ్లు తెగిపడ్డాయి. ఈ ఘటన కామారెడ్డి రైల్వే స్టేషన్లో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
Kamareddy Railway Station | మహారాష్ట్ర ఉమ్రివాసి..
మహారాష్ట్ర(Maharashtra) ఉమ్రి జిల్లాకు చెందిన అనిల్ అనే యువకుడు మాచారెడ్డిలోని ఇటుక బట్టీలో పనిచేస్తున్నాడు. బుధవారం కామారెడ్డి రైల్వే స్టేషన్‌లోని రెండో నంబర్ ప్లాట్ ఫాంపై రన్నింగ్ ట్రెయిన్ ఎక్కే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో జారిపోయి పట్టాలకు, రైలుకు మధ్యలో ఇరుక్కుపోయాడు. దీంతో అతడి రెండుకాళ్లు తెగిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో అనిల్ మద్యం మత్తులో ఉన్నట్టుగా సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్టేషన్ సిబ్బంది వెంటనే అనిల్‌ను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు(GGH Kamareddy) తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి(Gandhi Hospital) తరలించారు. ప్రస్తుతం అనిల్ స్పృహలో లేడని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని రైల్వే పోలీసులు తెలిపారు.