అక్షరటుడే, వెబ్‌డెస్క్ : America | హనుమంతుడిపై అమెరికన్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన దేవుడు కాదంటూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన 50 శాతం సుంకాలు విధించగా.. ఇటీవల హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజును భారీగా పెంచారు. తాజాగా అమెరికన్ రిపబ్లిక్ పార్టీ నేత అలెగ్జాండర్ డంకన్ (Alexander Duncan) హనుమంతుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశరు. అమెరికాలోని టెక్సాస్‌లో ‘స్టాట్యూ ఆఫ్ యూనియన్’ పేరిట 90 అడుగుల హనుమంతుడి విగ్రహం (Lord Hanuman Statue) ఏర్పాటు చేశారు. దీనిపై రిపబ్లికన్ నాయకుడు డంకన్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి.
America | తీవ్ర విమర్శలు
క్రైస్తవ దేశమైన అమెరికాలో (America) హిందూ దేవత విగ్రహ నిర్మాణాన్ని డంకన్ వ్యతిరేకించారు. టెక్సాస్‌లో నకిలీ హిందూ దేవుడి విగ్రహాన్ని ఎందుకు అనుమతిస్తున్నామని ఆయన ప్రశ్నించారు. “మీకు నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు. మీరు మీ కోసం ఏ రకమైన విగ్రహాన్ని లేదా స్వర్గంలో లేదా భూమిపై లేదా సముద్రంలో ఏదైనా ప్రతిమను తయారు చేసుకోకూడదు” అనే బైబిల్ వ్యాఖ్యలను ఆయన పోస్ట్ చేశారు. అయితే డంకన్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. హిందూ అమెరికన్ ఫౌండేషన్ (Hindu American Foundation) ఈ ప్రకటనను “హిందూ వ్యతిరేక, రెచ్చగొట్టేది” అని పేర్కొంది. ఆయనపై చర్యలు చేపట్టాలని రిపబ్లికన్ పార్టీని కోరింది.
‘‘వివక్షకు వ్యతిరేకంగా మీ స్వంత మార్గదర్శకాలను బహిరంగంగా ఉల్లంఘించే మీ పార్టీ సెనేట్ అభ్యర్థిని మీరు క్రమశిక్షణలో ఉంచుతారా” అని హెచ్ఏఎఫ్ పోస్ట్ చేసింది. అమెరికా రాజ్యాంగం ఏ మతాన్ని అయినా ఆచరించే స్వేచ్ఛను ఇస్తుందని నెటిజన్లు రిపబ్లికన్ నాయకుడికి గుర్తు చేశారు. కాగా.. టెక్సాస్‌లో 2024లో ఆవిష్కరించబడిన ‘స్టాట్యూ ఆఫ్ యూనియన్’ పేరిట హనుమంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అమెరికాలో ఎత్తయిన హిందూ స్మారక చిహ్నాలలో ఇదీ ఒకటి.