America | భారత్​కు అమెరికా హెచ్చరిక..! రష్యాతో వ్యాపారం చేస్తే 500 శాతం సుంకం!

అక్షరటుడే, న్యూఢిల్లీ: America : భారత్​(BHARATH)టు, చైనా(CHINA)కు అమెరికా తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. రష్యా (Russia) తో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే 500 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు యూఎస్ అ​ధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలో సెనెట్​లో బిల్లు తీసుకొస్తామని ప్రకటించింది. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిపబ్లికన్ సెనెటర్ లిండ్సే గ్రాహం Senator Lindsey Graham ఈ విషయాలు వెల్లడించారు. ‘రష్యా నుంచి చమురును భారత్, చైనా 70 శాతం కొనుగోలు […]

అక్షరటుడే, న్యూఢిల్లీ: America : భారత్​(BHARATH)టు, చైనా(CHINA)కు అమెరికా తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. రష్యా (Russia) తో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే 500 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు యూఎస్ అ​ధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలో సెనెట్​లో బిల్లు తీసుకొస్తామని ప్రకటించింది. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిపబ్లికన్ సెనెటర్ లిండ్సే గ్రాహం Senator Lindsey Graham ఈ విషయాలు వెల్లడించారు.

‘రష్యా నుంచి చమురును భారత్, చైనా 70 శాతం కొనుగోలు చేస్తున్నాయి. ఇలాంటి దేశాల ఉత్పత్తులపై 500 శాతం సుంకం విధించేలా చర్యలు తీసుకుంటాం’ అని లిండ్సే వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఈ విధమైన బిల్లును ఆగస్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. ఈ విధమైన బిల్లుకు ట్రంప్ సైతం మద్దతు తెలిపినట్లు చెప్పారు.

America : ఆర్థికంగా దెబ్బతీసేందుకేనా..

అగ్ర రాజ్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. పూర్తిగా పెట్టుబడిదారి వ్యవస్థ కలిగిన ఆమెరికా.. ప్రపంచాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవాలని చూస్తోంది. దీనికి అధ్యక్షుడు ట్రంప్ వంత పాడటం యూఎస్​కు కలిసొస్తోంది. ఈ క్రమంలో రష్యాను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సెనెటర్​ చేసిన వ్యాఖ్యలుగా పేర్కొంటున్నారు.

రష్యా నుంచి భారత్​, చైనా పెద్దమొత్తంలో ముడి చమురు కొనుగోలు చేస్తున్నాయి. తాజాగా సెనెటర్​ చెప్పిన బిల్లు అమల్లోకి వస్తే.. ఈ దేశాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. భారత్​ ఔషధాలు, వస్త్రాల వంటి ఎగుమతులపై తీవ్ర ప్రభావమే పడుతుందంటున్నారు ఆర్థిక నిపుణులు. ఉక్రెయిన్ కు అండగా ఉంటూ వస్తున్న యూఎస్​.. ఆ దేశానికి మద్దతు తెలిపే రాజ్యాల కోసం లిండ్సే మరో ఒప్పందాన్ని ప్రతిపాదించనున్నట్లు ప్రచారంలో ఉంది.

America : తక్కువ సుంకాలతో ఒప్పందం..!

ఇదిలా ఉంటే.. యూఎస్​ అధ్యక్షుడు ట్రంప్​ కీలక ప్రకటన చేశారు. త్వరలో భారత్​తో వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. చాలా తక్కువ సుంకాలతో ఈ ఒప్పందం ఉండనున్నట్లు పేర్కొన్నారు. కాగా, భారత్ ఇంకా దీనికి తమ అంగీకారం తెలపలేదన్నారు. వారు ఒప్పుకొంటే తక్కువ సుంకాలు విధించేలా చర్యలు తీసుకుంటామని ట్రంప్​ చెప్పుకొచ్చారు. కాగా, జులై 9వ తేదీ లోగా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరుదేశాల ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...