అక్షరటుడే, బాన్సువాడ: Ambedkar | అంబేడ్కర్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత, అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని బాన్సువాడ పట్టణంలో ఆయన విగ్రహానికి పోచారం పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమానత్వం కోసం చేసిన పోరాటం, భారత రాజ్యాంగ (Indian Constitution) నిర్మాణంలో చేసిన అమూల్యమైన పాత్రను కొనియాడారు. అంబేడ్కర్ స్ఫూర్తితో సమానత్వం, సామాజిక న్యాయ స్థాపనలో ప్రతిఒక్కరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పిట్ల శ్రీధర్, కృష్ణారెడ్డి, ఎజాజ్, గౌస్ పాషా తదితరులు పాల్గొన్నారు.
