Homeజిల్లాలునిజామాబాద్​Ambedkar | దేశానికి అంబేడ్కర్​ చేసిన సేవలు మరువలేనివి..

Ambedkar | దేశానికి అంబేడ్కర్​ చేసిన సేవలు మరువలేనివి..

డాక్టర్ అంబేడ్కర్​ జయంతిని జిల్లాలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్​ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలు మరువలేనివని వక్తలు పేర్కొన్నారు.

- Advertisement -

అక్షరటుడే, భీమ్​గల్/కోటగిరి/ఆర్మూర్​: Ambedkar | భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ అంబేడ్కర్​ (Dr. Babasaheb Bhimrao Ambedkar) జయంతిని జిల్లాలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్​ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలు మరువలేనివని వక్తలు పేర్కొన్నారు.

భీమ్​గల్ పట్టణంలో (Bheemgal Town) దళిత ఐక్య సంఘటన్​ ఆధ్వర్యంలో అంబేడ్కర్​ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత ఐక్య సంఘటన గౌరవాధ్యక్షుడు కాంతయ్య మాట్లాడుతూ.. అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా, సమానత్వం కోసం నిరంతరం పోరాడిన మహాక్రాంతికారిగా అంబేద్కర్ సేవలను కొనియాడారు.

కార్యక్రమంలో సంఘటన్​ మాజీ అధ్యక్షుడు పర్స నవీన్, గడల ప్రసాద్, కమిటీ సభ్యులు పత్రి రాజేందర్, బట్టు అనిల్, బట్టు సునీల్, గట్టు రతన్, పత్రి సంతోష్, బద్దం సంపత్, బట్టు అరుణ్, కైత సాగర్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Ambedkar | కోటగిరిలో..

రాజ్యాంగ నిర్మాత, అంబేద్కర్ వర్ధంతిని శనివారం పోతంగల్ మండల కేంద్రంలో (Pothangal mandal) నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు వీరు మాట్లాడుతూ.. అంటరానితనం, అవమానతలపై అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు, కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపిన మహానుభావుడు అంబేద్కర్ అని గుర్తు చేశారు. కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు, భీం​రావు, సుభాష్, సూరి, సతీష్, జైపాల్, గంధపు పవన్, మాణిక్ అప్పా, వర్ని శంకర్, కేశ వీరేశం, పులకంటి, సాయిలు, భూమయ్య, మన్సూర్, గంధపు రాజు దత్తు, గంగులు, ధన్​రాజ్, నాగేష్, బాల ప్రసాద్, అనిల్, గంగాధర్, సంజు కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Ambedkar | ఆర్మూర్​లో..

అంబేద్కర్ వర్ధంతిని వేడుకలను ఆర్మూర్​ పట్టణంలో (Armoor Town) శనివారం నిర్వహించారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆశన్న గారి రాజేశ్వర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్, దళిత సంఘాల నాయకులు గుమ్మడి చంద్రయ్య, జంగం అశోక్, ఆర్మూర్ సీపీఎం నాయకులు పల్లపు వెంకటేష్, కుతాడి ఎల్లయ్య, కాంగ్రెస్ ఆలూరు మండలాధ్యక్షుడు ముక్కెర విజయ్ అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Must Read
Related News