అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Republic Day sale | దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే షాపింగ్ (Republic Day Shoping) సందడి మొదలుకాబోతోంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ (Amazon and Flipkart) ఇప్పటికే తమ భారీ సేల్స్‌కు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి.
ఫ్లిప్‌కార్ట్ ముందుగానే తన రిపబ్లిక్ డే సేల్ తేదీలను ప్రకటించగా, తాజాగా అమెజాన్ కూడా 2026 సంవత్సరానికి సంబంధించిన ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ ను అధికారికంగా ప్రకటించింది. అమెజాన్‌లో రిపబ్లిక్ డే సేల్ జనవరి 16 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో భాగంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డులు (Credit Cards) మరియు ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్ అందించనున్నట్లు అమెజాన్ వెల్లడించింది. ఇప్పటికే అమెజాన్ యాప్‌లో కొన్ని ఎంపిక చేసిన డీల్స్‌కు సంబంధించిన టీజర్లు కనిపిస్తూ, వినియోగదారుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
Republic Day sale | ప్రత్యేక ఆఫర్స్..
ఈ ప్రత్యేక సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు (LapTop), డెస్క్‌టాప్ పీసీలు, స్మార్ట్ గ్లాసెస్, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషిన్లు, ప్రొజెక్టర్లు వంటి అనేక ఎలక్ట్రానిక్, హోమ్ అప్లయన్స్ విభాగాలపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. పూర్తి స్థాయి డీల్స్ వివరాలు సేల్ ప్రారంభానికి దగ్గరగా వెల్లడయ్యే అవకాశం ఉందని కంపెనీ సూచించింది. ఇదిలా ఉండగా, ఫ్లిప్‌కార్ట్ తన రిపబ్లిక్ డే సేల్‌ను జనవరి 17 నుంచి ప్రారంభించనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ మెంబర్‌షిప్ ఉన్న వినియోగదారులకు సేల్‌కు 24 గంటల ముందే ప్రత్యేక యాక్సెస్ కల్పించనున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్, అలాగే ఆకర్షణీయమైన ఈఎంఐ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
అదనంగా, ఎంపిక చేసిన బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులతో Credit Cards చెల్లింపులు చేస్తే 15 శాతం వరకు డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. రెండు ప్లాట్‌ఫాంలు కూడా స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, హోమ్ అప్లయన్స్ విభాగాలపై భారీ ధరల తగ్గింపులు అందించనున్న నేపథ్యంలో, రిపబ్లిక్ డే సందర్భంగా ఆన్‌లైన్ షాపింగ్‌కు వినియోగదారులు పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నారు. ఈ సేల్స్‌తో కొత్త సంవత్సరం ఆరంభంలోనే ఈ-కామర్స్ మార్కెట్‌లో పోటీ మరింత వేడెక్కనుంది.