అక్షరటుడే, ఆర్మూర్: Alumni reunion | వేల్పూర్ మండలంలోని (Velpur mandal) రామన్నపేట్ గ్రామానికి చెందిన 1994-95 బ్యాచ్ ఎస్సెస్సీ విద్యార్థులు మంగళవారం ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. రామన్నపేట గ్రామంలోని (Ramannapet village) సుంకేట్ రోడ్డులో ఉన్న మొటాటిరెడ్డి కల్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
నాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు రామోజీ రాములు (రామన్నపేట్), మగ్గిడి శంకర్ (మోర్తాడ్), ఆర్.శివాజీ(బోధన్)లను సత్కరించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రేగుల్ల మంజుల, నాగలత, శ్యామల, విజయలక్ష్మి, సాయమ్మ, పిట్ల గణేశ్, జాగిరపు శోభన్ రెడ్డి, కంకణాల రవి, జాగిరపు మోహన్ రెడ్డి, గుమ్ముల రమేశ్, గడ్డం మహేశ్, రాజా రమేశ్, పెద్దోళ్ల (జాగిరపు) సుదాం రెడ్డి, తీగల సంతోష్, కుంట శ్రీనివాస్, పల్లికొండ గూండ్ల నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
