78
అక్షరటుడే, ఇందూరు : Alishetti Prabhakar | పీడిత ప్రజల గొంతుక అలిశెట్టి ప్రభాకర్ అని సామాజిక రచయతల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రేమ్‌లాల్ (District President Prem Lal) అన్నారు. నగరంలోని సంస్థ కార్యాలయంలో ప్రభాకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Alishetti Prabhakar | కవితలతో జనాల్లో చైతన్యం..
అలిశెట్టి ప్రభాకర్ తన కవితలు, రచనల ద్వారా జనాల్లో చైతన్యం తెచ్చేందుకు విశేష కృషి చేశారన్నారు. చురకలు, రక్తరేఖ వంటి అద్భుతమైన కవితలు రచించిన వ్యక్తి ఆయన అని పేర్కొన్నారు. కవిగా, చిత్రకారుడిగా గొప్పపేరు సాధించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వేముల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.