అక్షరటుడే, వెబ్డెస్క్ : Coldwave | రాష్ట్రంలో కొద్ది రోజులుగా చలి కాస్త తగ్గింది. అయితే రానున్న పది రోజులు ఉష్ణోగ్రతలు (Temperatures) భారీగా పడిపోతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. చలిగాలులు వణికిస్తాయన్నారు.
ఈ ఏడాది చలికాలం ప్రారంభం నుంచే శీతలగాలులు వీస్తున్నాయి. నవంబర్ రెండో వారం నుంచి భారీగా చలి పెట్టింది. సాయంత్రం 6 అయిందంటే కాలు బయట్ట పెట్టలేని పరిస్థితి. ఉదయం 10 గంటల వరకు చలి తీవ్రత కొనసాగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దిత్వా తుపాన్ కారణంగా కొన్ని రోజులు చలి తగ్గింది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. దీంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. తాజాగా మరోసారి చలితీవ్రత పెరుగుతుందని అధికారులు (Meteorological Department Officers) చెప్పడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Coldwave | అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్రంలో రానున్న పది రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. ఉత్తర తెలంగాణ (Telangana)లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే అవకాశం ఉంది. నేటి రాత్రి నుంచే చలి తీవ్రత పెరగనుంది. హైదరాబాద్ (Hyderabad) నగరంలో రేపటి నుంచి చలి పెరుగుతుంది. శీతల గాలులు వీయనుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రాత్రి పూట అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలన్నారు. ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తలు పాటించాలి.
