అక్షరటుడే, వెబ్డెస్క్ : Srivari Seva | తిరుమల (Tirumala) శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. ఆయన సేవలో తరలించాలని ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. భక్తులు స్వామి వారి సేవ చేసుకోవడానికి టీటీడీ (TTD) పలు సౌకర్యాలను కల్పించింది.
శ్రీవారి సేవ, పరకామణి సేవ, నవనీత సేవల రూపంలో భక్తులకు అవకాశం కల్పిస్తోంది. ఆయా సేవల కోసం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే పరిపాలన కారణాలతో డిసెంబర్ నెల శ్రీవారి సేవ జనరల్ కోటా, పరకామణి సేవ, నవనీత సేవ టికెట్ల విడుదలను టీటీడీ వాయిదా వేసింది. ఈ టికెట్లు ఈ నెల 30న విడుదల చేస్తామని గతంలో టీటీడీ ప్రకటించింది. అయితే తాజాగా.. ఆయా టికెట్లను నవంబర్ 5న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని తెలిపింది.
Srivari Seva | వైకుంఠ ద్వార దర్శనం
వైకుంఠ ద్వార దర్శనం జనరల్ శ్రీవారి సేవ కోసం తొమ్మిది రోజుల స్లాట్లను టీటీడీ రిలీజ్ చేస్తోంది. వైకుంఠ ఏకాదశి స్లాట్ కోసం ప్రత్యేక తొమ్మిది రోజుల కోటాను నవంబర్ 5న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. స్లాట్ తేదీలు 28-12-2025 నుంచి 05-01-2026 వరకు, 29-12-2025 నుంచి 06-01-2026 వరకు ఉంటాయన్నారు.

