అక్షరటుడే, వెబ్డెస్క్ : Tirumala | తిరుమలలో కొలువైన శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. స్వామివారిని నిత్యం సుప్రభాత సేవతో మేల్కొలిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. అయితే ధనుర్మాసం నేపథ్యంలో సుప్రభాత సేవ రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు (TTD Officers) తెలిపారు.
తిరుమలలో నిత్యం ఉదయం సుప్రభాత సేవ (Suprabhata Seva) నిర్వహిస్తారు. దీని కోసం భక్తులు భారీగా దరఖాస్తులు చేసుకుంటారు. అయితే సేవ భాగ్యం కొందరికే కలుగుతుంది. ప్రతి ఏటా ధనుర్మాసంలో సుప్రభాత సేవను రద్దు చేస్తారు. దానికి బదులు తిరుప్పావై పారాయణం నిర్వహిస్తారు. డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ప్రారంభం కానుంది. దీంతో ఆ రోజు నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవ రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
Tirumala | వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు
ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి దోశ, బెల్లం దోశ, సుండలు, సీరా, పొంగల్ వంటి ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు. మరోవైపు వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 30 నుంచి జనవరిఇ 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం (Vaikuntha Dwara Darshanam) కల్పించనున్నారు. ఇది వరకే ఆన్లైన్లో టికెట్లను విడుదల చేశారు.
Tirumala | కార్ల విరాళం
తిరుపతికి చెందిన లోటస్ ఎలక్ట్రిక్ ఆటో వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరుతో అర్జున్ కొల్లికొండ అనే భక్తుడు టీటీడీకి రూ.10 లక్షల విలువైన సిట్రాయెన్ ఎలక్ట్రిక్ కారు (Citroen Electric Car)ను విరాళం అందించారు. చెన్నైకు చెందిన శరవనన్ కరుణాకరన్ రూ.9 లక్షలు విలువైన సిట్రాయెన్ కారును అందజేశారు.