Tiranga Vijaya Yatra | వాహనదారులకు అలర్ట్.. నేడు ఆ ప్రాంతంలో ట్రాఫిక్​ ఆంక్షలు

అక్షరటుడే, హైదరాబాద్: Tiranga Vijaya Yatra : పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgaon terror attack)కి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) విజయవంతంగా కొనసాగింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా తిరంగా విజయయాత్ర చేపట్టాని బీజేపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ(Telangana BJP) యూనిట్ శనివారం (మే 17) హైదరాబాద్ లో​ తిరంగా యాత్ర చేపట్టనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని వాహనదారులకు నగర ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. మహానగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ […]

అక్షరటుడే, హైదరాబాద్: Tiranga Vijaya Yatra : పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgaon terror attack)కి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) విజయవంతంగా కొనసాగింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా తిరంగా విజయయాత్ర చేపట్టాని బీజేపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ(Telangana BJP) యూనిట్ శనివారం (మే 17) హైదరాబాద్ లో​ తిరంగా యాత్ర చేపట్టనుంది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని వాహనదారులకు నగర ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. మహానగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు(Traffic restrictions) విధిస్తున్నట్లు ప్రకటించారు.

శనివారం సాయంత్రం 5.30 నుంచి 7.30 వరకు అంబేడ్కర్ విగ్రహం, సచివాలయం జంక్షన్, పెల్లింగ్ క్లబ్, డీబీఆర్ మిల్స్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఈ సమయంలో వాహనాలను దారి మళ్లించనున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ట్రాఫిక్ అడిషనల్ సీపీ జోయల్ డేవిస్ సూచించారు.

తిరంగా ర్యాలీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy), బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు (BJP MLAs, MPs) ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరుకానున్నారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...