Weather Updates | రైతులకు అలెర్ట్​.. నేడు భారీ వర్ష సూచన

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | తెలంగాణలో మంగళవారం భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం వరి కోతల నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రాష్ట్రంలో గత వారం రోజులుగా వరుణుడు కాస్త శాంతించాడు. కొన్ని జిల్లాల్లో అడపాదడప వర్షాలు కురిసినా మిగతా ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంది. దీంతో నాలుగైదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వరికోతలు ఊపందుకున్నాయి. వానలు లేకపోవడంతో రైతులు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | తెలంగాణలో మంగళవారం భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం వరి కోతల నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

రాష్ట్రంలో గత వారం రోజులుగా వరుణుడు కాస్త శాంతించాడు. కొన్ని జిల్లాల్లో అడపాదడప వర్షాలు కురిసినా మిగతా ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంది. దీంతో నాలుగైదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వరికోతలు ఊపందుకున్నాయి. వానలు లేకపోవడంతో రైతులు పొలాలు కోసి వడ్లు ఆరబోస్తున్నారు. ఈ క్రమంలో నేటి నుంచి మళ్లీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో రైతులు (Farmers) ఆందోళన చెందుతున్నారు. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండటంతో వడ్ల కుప్పల దగ్గరే కాపలా ఉన్నారు.

Weather Updates | ఆ జిల్లాలకు అలెర్ట్​..

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం సైతం వర్షం పడింది. మంగళవారం సైతం నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్​, రంగారెడ్డి, మహబూబ్​నగర్​, వికారాబాద్​, నాగర్​ కర్నూల్​, వనపర్తి, కొత్తగూడెం, ములుగు, జనగామ, మెదక్​, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్​ నగరంలో సైతం వర్షాలు పడే ఛాన్స్​ ఉంది. అయితే మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...