HomeజాతీయంSabarimala | అయ్యప్ప భక్తులకు అలెర్ట్​.. 24న శబరిమలకు ప్రత్యేక రైలు

Sabarimala | అయ్యప్ప భక్తులకు అలెర్ట్​.. 24న శబరిమలకు ప్రత్యేక రైలు

అయ్యప్ప భక్తుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. నాందేడ్​ నుంచి కొల్లాం వయా నిజామాబాద్​ మీదుగా ఈ నెల 24న రైలు వెళ్లనుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sabarimala | శబరిమలలో అయ్యప్ప (Ayyappa) దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో భక్తుల కోసం వివిధ ప్రాంతాల నుంచి రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.

మండల – మకరవిళక్కు సీజన్​ నేపథ్యంలో నవంబర్​ 16న శబరిమలలో ఆలయాన్ని తెరిచిన విషయం తెలిసిందే. నవంబర్​ 17 నుంచి భక్తులకు స్వామి వారి దర్శనం కల్పిస్తున్నారు. ఆన్​లైన్​, స్పాట్ బుకింగ్​ ద్వారా అయ్యప్ప దర్శనానికి (Ayyappa Darshan) టోకెన్లు జారీ చేస్తున్నారు. అయ్యప్ప భక్తుల కోసం రైల్వే శాఖ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. తెలంగాణ నుంచి ఎంతో మంది స్వామి దర్శనానికి వెళ్తుంటారు. వారికోసం నాందేడ్​ (Nanded) నుంచి కొల్లం (07123) రైలును ఈ నెల 24న అధికారులు నడపనున్నారు.

ఈ స్పెషల్​ ట్రైన్​ నాందేడ్​ నుంచి బయలు దేరి కొల్లం చేరుకుంటుంది. మధ్యలో 38 స్టేషన్లలో ఆగుతుంది. తెలంగాణలోని బాసర, నిజామాబాద్ (Nizamabad)​, ఆర్మూర్​, కోరుట్ల, లింగంపేట, కరీంనగర్​, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్​, కేసముద్రం, మహబూబాబాద్​, డోర్నకల్​, ఖమ్మం స్టేషన్లలో ఆగుతుంది. భక్తులు ఈ రైలును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

Must Read
Related News