అక్షరటుడే, ఆర్మూర్: Alai Balai | మండలంలోని అంకాపూర్ గ్రామంలో శుక్రవారం అలయ్ బలయ్ (Alai Balai) కార్యక్రమం నిర్వహించారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగగా.. గ్రామస్థులంతా ఒకరికొకరు అలయ్‌బలయ్ చేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (MLA Paidi Rakesh Reddy), పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, మార్క్‌ఫెడ్ ఛైర్మన్ మార గంగారెడ్డి, గ్రంథాలయ మాజీ ఛైర్మన్ మార చంద్రమోహన్, గ్రామ మాజీ సర్పంచ్ కిషోర్ రెడ్డి, ఎంసీ గంగారెడ్డి గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.