HomeసినిమాMahakali Movie | ‘మహాకాళి’ ధమాకా.. శుక్రాచార్యగా అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్ రిలీజ్

Mahakali Movie | ‘మహాకాళి’ ధమాకా.. శుక్రాచార్యగా అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్ రిలీజ్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahakali Movie | ‘హనుమాన్’ విజయం తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘మహాకాళి’. ఫీమేల్ సూపర్‌హీరో కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రశాంత్ వర్మ (Prashant Verma) కథ అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. దసరా పర్వదినం సందర్భంగా ‘మహాకాళి’ నుంచి శుక్రాచార్య పాత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో బాలీవుడ్ స్టార్ అక్షయ్ ఖన్నా (Akshay Khanna) విలన్‌గా శుక్రాచార్యుడి పాత్రలో దర్శనమిచ్చాడు. పోస్టర్‌లో ఆయన లుక్ మిస్టీరియస్, పవర్‌ఫుల్‌గా ఉంది. దేవతల నీడలో శక్తివంతమైన తిరుగుబాటు జ్వాలగా ఎదిగిన శుక్రాచార్యుడు” అనే ట్యాగ్‌లైన్‌తో పోస్టర్‌ను రిలీజ్ చేయడం సినిమాకు మరింత హైప్ తీసుకువచ్చింది.

Mahakali Movie | ఫీమేల్ సూపర్‌హీరో కాన్సెప్ట్

ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న PVCUలో ఇప్పటి వరకు వచ్చిన ప్రాజెక్ట్స్ మగ హీరోల చుట్టూ తిరిగినవే. అయితే మహాకాళి మాత్రం తొలి సారి ఫీమేల్ సూపర్‌హీరో ఆధారిత చిత్రంగా తెరకెక్కుతోంది. ఇది ఇండియన్ సూపర్‌హీరో సినిమాల చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించనుందని సినీ వర్గాల్లో మాటలు వినిపిస్తున్నాయి. ‘మహాకాళి’తో పాటు PVCUలో ప్రశాంత్ వర్మ మరో రెండు భారీ సినిమాలను కూడా రూపొందిస్తున్నాడు. జై హనుమాన్ (హనుమాన్ సినిమాకు సీక్వెల్), అధీర – మరో విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సినిమాలు. ఈ చిత్రాలకు కూడా ప్రశాంత్ వర్మ కథను అందిస్తున్నారు. రెండూ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నాయి.

ఇక మేకర్స్ ప్లాన్ ప్రకారం ఈ ఏడాది చివరలో ‘మహాకాళి’ సినిమా (Mahakali Movie) గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారీ విజువల్స్, వీఎఫ్‌ఎక్స్‌తో పాటు బాలీవుడ్‌ హంగుతో తెరకెక్కుతున్న ఈ సినిమా టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ప్రశాంత్ వర్మ తన సరికొత్త సినిమాటిక్ యూనివర్స్ ద్వారా భారతీయ సూపర్‌హీరో జానర్‌కు కొత్త ఊపిరిపోశాడు. ఇప్పుడు మహాకాళి రూపంలో ఓ శక్తిమంతమైన స్త్రీపాత్రను పరిచయం చేయనున్నాడు. శుక్రాచార్య పాత్రలో అక్షయ్ ఖన్నా లుక్‌కి వచ్చిన రెస్పాన్స్ చూస్తే, ఈ సినిమా కూడా PVCU లో మరో హిట్‌గా నిలవనుంది.