అక్షరటుడే, కోటగిరి: Aksharatoday Calendar | ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తూ.. డిజిటల్ మీడియా రంగంలో ‘అక్షరటుడే’ దినపత్రిక (AksharaToday newspaper) దూసుకెళ్తోందని ఉమ్మడి కోటగిరి మండలాల తహశీల్దార్ గంగాధర్ అన్నారు. పోతంగల్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో శనివారం ‘అక్షరటుడే’ క్యాలెండర్ను ఆవిష్కరించారు.
Aksharatoday Calendar | అనతికాలంలోనే పాఠకుల ఆదరణ..
ఈ సందర్భంగా తహశీల్దార్ గంగాధర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న డిజిటల్ మీడియా రంగంలో అందరికంటే ముందు వార్తలను అందిస్తుండడంతో అనతి కాలంలోనే ‘అక్షరటుడే’కు ప్రజల్లో ఆదరణ వచ్చిందని తహశీల్దార్ అన్నారు. ప్రభుత్వ పథకాలు, ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేయడంలో మీడియా పాత్ర విశేషమైందని తెలిపారు. పాఠకులకు మరింత చైతన్య పరుస్తూ ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో చందర్, ఎంఈవో శంకర్, నాయబ్ తహశీల్దార్, అబ్దుల్ హజిజ్, ‘అక్షరటుడే’ ఉమ్మడి మండలాల ప్రతినిధి రాజు తదితరులు పాల్గొన్నారు.