89
అక్షరటుడే, మెండోరా: Aksharatoday Calendar | అనతి కాలంలో ‘అక్షరటుడే’ (Akshara Today) పాఠకుల ఆదరణ పొందుతూ ప్రత్యేకత చాటుకుంటోందని డిప్యూటీ తహశీల్దార్ ఎం. శ్రీనివాస్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో (MPDO office) ‘అక్షరటుడే‘ క్యాలెండర్లను ఎంపీడీవో లక్ష్మణ్, ఎస్సై సుహాసిని, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ప్రమోద్, ఉపాధ్యాయురాలు మమత ఆవిష్కరించారు.
Aksharatoday Calendar | డిజిటల్ మీడియా రంగంలో..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి డిజిటల్ మీడియా రంగంలో ‘అక్షరటుడే’ తనకంటూ లక్షలాది మంది పాఠకుల అభిమానాన్ని చురగొందన్నారు. ప్రాంతీయ, రాష్ట్ర, జాతీయ వార్తలను నిమిషాల్లోనే ప్రజలకు చేరవేస్తూ ప్రత్యేకత చాటుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ‘అక్షరటుడే’ మండల ప్రతినిధి భరత్, రెవెన్యూ, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.