అక్షరటుడే, ఇందూరు: AksharaToday Calendar | నేటి డిజిటల్ యుగంలో ‘అక్షరటుడే’ దినపత్రిక దూసుకెళ్తోందని పీసీసీ చీఫ్ (PCC Chief) బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ (Bomma Mahesh Kumar Goud), ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. నగరంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో వారు ‘అక్షర టుడే’ క్యాలెండర్లను (AksharaToday Calendars) ఆవిష్కరించారు.
AksharaToday Calendar | వేగంగా వార్తలు అందిస్తూ..
వారు మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా పత్రికారంగంలో కొంగొత్త మార్పులు చేటు చేసుకుంటున్నాయన్నారు. ఈ మార్పులకు అనుగుణంగా.. వార్తలను త్వరత్వరగా ప్రజలకు అందజేస్తూ ‘అక్షరటుడే’ పాఠకుల మన్ననలు పొందుతోందన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నుడా ఛైర్మన్ కేశవేణు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అరికెల నర్సారెడ్డి, రాజా నరేందర్ రెడ్డి, బట్టురాజ్, అక్షరటుడే క్రైం రిపోర్టర్ ప్రసాద్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.