130
అక్షరటుడే, గాంధారి: Aksharatoday Calendar | వేగంగా వార్తలు అందించడంలో ‘అక్షరటుడే’ (Akshara Today) ముందంజలో ఉందని ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. ఈ మేరకు బుధవారం గాంధారి మండలంలోని అయ్యప్ప ఆలయం వద్ద ‘అక్షరటుడే’ క్యాలెండర్లను ఆవిష్కరించారు.
Aksharatoday Calendar | పాఠకుల అభిమానం చూరగొంటూ..
నేటి డిజిటల్ మీడియాలో (digital media) ‘అక్షరటుడే’ తనకంటూ లక్షలాది మంది పాఠకుల అభిమానాన్ని చూరగొని దూసుకెళ్తోందని ఎమ్మెల్యే అన్నారు. ఎప్పటికప్పుడు సమస్యలనైనా.. సంఘటనలనైనా వేగంగా పాఠకులకు అందిస్తూ ‘అక్షరటుడే’ ప్రత్యేకత చాటుకుంటోందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో మీడియా పాత్ర ముఖ్యమైందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.