అక్షరటుడే, కమ్మర్పల్లి : Aksharatoday Calendar | డిజిటల్ మీడియా రంగంలో ‘అక్షరటుడే’ ప్రత్యేకస్థానం సాధించిందని తహశీల్దార్ ప్రసాద్ (Tahsildar Prasad) అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలో శుక్రవారం ఎంపీడీవో రాజ శ్రీనివాస్, ఎస్సై జి.అనిల్ రెడ్డి (SI G. Anil Reddy), కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి, తపస్ ఉపాధ్యాయ సంఘం మండల అధ్యక్షుడు సల్లూరి కిషన్ గౌడ్ ఆధ్వర్యంలో ‘అక్షరటుడే’ క్యాలెండర్లను ఆవిష్కరించారు.
‘అక్షరటుడే’ క్యాలెండర్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఎంపీడీవో కార్యాలయం (MPDO Office)లో నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. నేటి డిజిటల్ మీడియాలో ‘అక్షరటుడే’ తనకంటూ లక్షలాది మంది పాఠకుల అభిమానాన్ని సాధించిందన్నారు. ప్రాంతీయ, రాష్ట్ర, జాతీయ వార్తలను నిమిషాల్లోనే ప్రజలకు చేరవేస్తూ ప్రత్యేకత చాటుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ‘అక్షరటుడే’ మండల ప్రతినిధి వెంకటేష్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నాగభూషణం, మండల సాఫ్ట్బాల్ కోచ్ రాహుల్, రెవెన్యూ, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.