115
అక్షరటుడే, కామారెడ్డి: Aksharatoday Calendar | అనతికాలంలోనే ‘అక్షరటుడే’ ప్రజల్లో ఆదరణ పొందిందని కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy) అన్నారు. సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో మంగళవారం ‘అక్షరటుడే’ క్యాలెండర్లను ఆవిష్కరించారు.
Aksharatoday Calendar | ప్రజలను చైతన్యం చేస్తూ..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డిజిటల్ మీడియాలో శరవేగంగా దూసుకుపోతున్న ‘అక్షరటుడే’ పాఠకులను మరింత చైతన్యపరుస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా పాత్ర విశేషమైందని ఆమె తెలియజేశారు. కార్యక్రమంలో ‘అక్షరటుడే’ కామారెడ్డి డివిజన్ ఇన్ఛార్జి వడ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.