అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Akhanda 2 | బోయపాటి (Boyapati) దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కిన అఖండ–2 సినిమా టికెట్ల ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) అనుమతి ఇచ్చింది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అఖండ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అఖండ–2 తాండవంపై భారీ అంచనాలు ఉన్నాయి.
నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే డిసెంబర్ 4న ప్రీమియర్ షోలు (Premiere shows) వేసుకోవడానికి సైతం ఓకే చెప్పింది. 4న రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ప్రీమియర్ షో వేసుకోవచ్చు. దీని టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు.
ఈ నెల 5న సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆ రోజు నుంచి మల్టీప్లెక్స్‌లలో రూ.100, సింగిల్ థియేటర్లలో రూ.75 రేటు పెంచుకోవడానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. విడుదలైన రోజు నుంచి 10 రోజుల పాటు పెంచిన రేట్లు అమలులో ఉంటాయి.
Akhanda 2 | బాలయ్య ఫ్యాన్స్‌లో జోష్
బాలయ్య అఖండ తర్వాత వీర సింహారెడ్డి సినిమాలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత వసూళ్లు రాబట్టలేదు. దాదాపు రెండేళ్లుగా ఆయన సినిమాలు రిలీజ్ కాలేదు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ అఖండ–2 కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ మూవీపై అంచనాలను భారీగా పెంచాయి. ఈ సినిమాలో బాలకృష్ణతో పాటు సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. కాగా సినిమా టికెట్ల ధరలకు పెంపునకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలుపగా.. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
