Homeతాజావార్తలుAkhanda 2 Trailer | మ‌న స్టైల్ చూసి బాలీవుడ్‌కి దిమ్మ తిరిగింద‌న్న బాల‌య్య‌.. టీజ‌ర్‌తో...

Akhanda 2 Trailer | మ‌న స్టైల్ చూసి బాలీవుడ్‌కి దిమ్మ తిరిగింద‌న్న బాల‌య్య‌.. టీజ‌ర్‌తో సినిమాపై పెరిగిన‌ అంచ‌నాలు..!

Akhanda 2 Trailer | నంద‌మూరి బాల‌య్య ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న అఖండ 2 మ‌రి కొద్ది రోజుల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేయ‌డం ఖాయం అంటున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Akhanda 2 Trailer | నందమూరి బాలకృష్ణ Bala Krishna హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2: తాండవం’ డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైంది.

14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం రాత్రి హైదరాబాద్ కూకట్‌పల్లి కైతలాపూర్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ఇచ్చిన పవర్‌ఫుల్ స్పీచ్‌ అభిమానుల్లో మరింత జోష్ నింపింది.

Akhanda 2 Trailer | “సినిమాకి ఎలాంటి అడ్డుకట్టలు లేవు” – బాలయ్య

ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. “రక్తానికి జాతి లేదు… మాంసానికి మతం లేదు… చర్మానికి కులం Cast లేదు… అలాగే సినిమాకు ఎలాంటి తారతమ్యాలు ఉండవు. సినిమాను మనిషి నిత్యవసరాల్లో ఒకటిగా ఎంచుకున్నాడు.

అలాంటి సినిమా ఎలా ఉండాలో పరిశ్రమ పెద్దలు ఆలోచించాలి అని బాల‌య్య అన్నారు. అలాగే తన తండ్రి, మహానటుడు ఎన్టీఆర్‌ Ntrను గుర్తుచేసుకుంటూ..నా తండ్రే నాకు గురువు, దైవం. విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన యుగపురుషుడు, నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు అని అన్నారు.

ఇక రీసెంట్‌గా ప్రారంభమైన #NBK111 సినిమాలోని ఓ పవర్‌ఫుల్ డైలాగ్‌ను కూడా బాలయ్య స్టేజ్‌పై చెప్పి అభిమానులను ఉత్సాహపరిచారు.

“చరిత్రలో చాలామంది ఉంటారు… కానీ చరిత్రను తిరగరాసి మళ్లీ చరిత్ర సృష్టించే వాడు ఒక్కడే ఉంటాడు. నేనే ఆ చరిత్ర.” అని చెప్పి ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చారు.మ‌న స్టైల్ చూసి బాలీవుడ్‌కి కూడా దిమ్మ తిరిగిందని అన్నారు బాల‌య్య‌.

“లాక్‌డౌన్ సమయంలో విడుదలైన ‘అఖండ’కు మీరు ఇచ్చిన ప్రేమను ఎప్పటికీ మరిచిపోలేను. ‘అఖండ 2’లో నా పాత్ర ఎలా ఉంటుందో మీరు చూసి తీరాలి. నేను, బోయపాటి శ్రీను సినిమా చేయాలని నిర్ణయిస్తే 3 నిమిషాల్లోనే ముందుకు వెళ్తాం.

నటన అంటే నవ్వడం, ఏడవడం మాత్రమే కాదు… మరో ఆత్మలోకి ప్రవేశించడం. నేను పాదరసం లాంటి వాడిని ఏ పాత్రైనా చేస్తాను.”ఒకే పనికి అతుక్కుపోయే వ్యక్తిని నేను కాదు.

అందుకే నటుడిగా మాత్రమే కాదు, ఎమ్మెల్యేగా, బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్‌గా ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను అని బాల‌య్య అన్నారు. ఇక మూవీ టీజ‌ర్ కూడా ఇదే ఈవెంట్‌లో విడుద‌ల చేయ‌గా, ఈ టీజ‌ర్ ఫ్‌యాన్స్‌కి పూనకాలు తెప్పించింది. బాల‌య్య ప‌వర్ ఫుల్ డైలాగ్స్‌కి పిచ్చెక్కిపోయారు

Must Read
Related News