అక్షరటుడే, వెబ్‌డెస్క్: Akhanda 2: Tandavam | ‘అఖండ 2: తాండవం’ సినిమా వాయిదా పడింది. ఈ చిత్రం డిసెంబరు 5న విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా సినీ యూనిట్ వాయిదా వేసింది.
మద్రాస్ హైకోర్టులో దాఖలైన కేసు నేపథ్యంలో విడుదల నిలిపివేసినట్లు స్పష్టం అవుతోంది. మళ్లీ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించలేదు.
సీనియర్ టాలివుడ్ నటుడు బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ 2 విడుదలపై నిన్న రోజంతా ఉత్కంఠ నెలకొంది. మద్రాస్ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ పరిస్థితి ఏర్పడింది.
Akhanda 2: Tandavam | చివరి వరకు ఉత్కంఠ..
మద్రాస్ హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అఖండ 2 ప్రీమియం షో వరకు విడుదలపై ఉత్కంఠ కొనసాగింది. చివరికి ప్రీమియం షో రద్దు చేయడంతో ఉత్కంఠకు తెరపడింది. అఖండ 2 చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారికంగా ప్రకటించింది.
