HomeసినిమాAkhanda 2 | చిక్కుల్లో అఖండ 2 చిత్రం.. రిలీజ్‌కి కొద్ది గంట‌ల ముందు మూవీని...

Akhanda 2 | చిక్కుల్లో అఖండ 2 చిత్రం.. రిలీజ్‌కి కొద్ది గంట‌ల ముందు మూవీని పోస్ట్‌పోన్ చేసిన నిర్మాత‌లు

రిలీజ్‌కి కొద్ది స‌మ‌యం ముందు అఖండ 2 చిత్రాన్ని వాయిదా వేస్తున్న‌ట్టు 14 రీల్స్ ప్లస్ స్పష్టం చేసింది.ప్రీమియర్ల క్యాన్సిలేషన్‌ షాక్‌ నుంచి ఫ్యాన్స్ బయటపడకముందే, అసలు విడుదల కూడా వాయిదా పడటంతో మరింత నిరుత్సాహం నెలకొంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Akhanda 2 | ఈ మధ్యకాలంలో ఏ స్టార్ హీరో సినిమా ఎదుర్కోని అవమానం ‘అఖండ 2’ విషయంలో చోటు చేసుకోవడం ఇండస్ట్రీ మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. భారీ ప్రమోషన్స్, అన్ని రాష్ట్రాల్లో హంగామా, బహుభాషా ఇంటర్వ్యూలు…సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చాయి.

అయితే రిలీజ్‌కి కొన్ని గంటల ముందు వరకూ హైప్ బాగానే ఉన్నా స‌డెన్‌గా డిసెంబర్ 4 ప్రీమియర్లు క్యాన్సిల్ (Premieres Cancel) చేశారు. ఆ త‌ర్వాత డిసెంబర్ 5న థియేటర్లలోకి రావాల్సిన మూవీ కూడా వాయిదా వేసిన‌ట్టు మేక‌ర్స్ సోష‌ల్ మీడియా (Social Media) ద్వారా తెలియ‌జేశారు. ప్రస్తుతానికి సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే స్పష్టత కూడా లేదు. ఈ అనిశ్చితి అభిమానులను మాత్రమే కాదు, ఫిల్మ్ నగర్‌ని కూడా షాక్‌కు గురి చేసింది.

Akhanda 2 | విడుద‌ల వాయిదా..

ప్రీమియర్ల రద్దు విషయంలో అనివార్య కార‌ణాల‌ని 14 రీల్స్ చెప్పిన‌ప్ప‌టికీ కొంద‌రు మాత్రం ఫైనాన్షియ‌ల్ ఇష్యూస్ అంటున్నారు. సోషల్ మీడియాలో కొందరు “ఎరోస్ సంస్థకు 27 కోట్లు క్లియర్ చేయలేకపోయారా?” అని ప్రశ్నిస్తున్నా, అది అసలు విషయం కాదంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు (Industry Categories). ఎరోస్ తెచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ కేవలం 27 కోట్లకే కాదు, ఆరేళ్ల వడ్డీతో మొత్తం సుమారు 50 కోట్లు అయ్యిందట. సమయం చూసి, 14 రీల్స్‌తో పాత లావాదేవీలు ఉన్న ఇంకొందరు కూడా తమ బకాయిల కోసం ఒత్తిడి పెంచారట. మొత్తం కలిపి ఇష్యూ సుమారు 70 కోట్లు దాటిందని టాక్. ఈ స్థితిలో వెంటనే 70 కోట్లు వెచ్చించడం అసాధ్యం

ఎంతటివారైనా, వెంటనే 70 కోట్ల రూపాయలు వెచ్చించి చిత్రం విడుదల చేయడం ఆచరణ సాధ్యం కాదు. రాజకీయ జోక్యంతో కూడా అంత త్వరగా క్లియర్ అయ్యే సమస్య కాదని వర్గాలు చెబుతున్నాయి. ఈ ఇష్యూపై స్పందించిన 14 రీల్స్.. అనివార్య కారణాల వల్ల అఖండ 2 నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం విడుదల చేయడం సాధ్యపడడం లేదు. దీనిపై మేము హృదయపూర్వక విచారం వ్యక్తం చేస్తున్నాం. ఈ పరిస్థితి ప్రతి అభిమానికి, సినీ ప్రేమికుడికి ఎంత నిరాశ కలిగిస్తుందో మాకు తెలుసు. సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు మా టీమ్‌ నిరంతరం కృషి చేస్తోంది. ఈ నిర్ణయంతో క‌లిగిన అసౌకర్యానికి క్షమాపణలు. ఈ సమయంలో మీ అండ, మద్దతు మాకు అత్యంత అవసరం. త్వరలోనే సానుకూల అప్‌డేట్‌తో మీ ముందుకు వస్తాం’’ అని నిర్మాణ సంస్థ ప్రకటించింది.

Must Read
Related News